Bride Committed Suicide: విషాదం.. వివాహమైన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య.. పోలీసుల విచారణ
Bride Committed Suicide: నవ వధువుకు నిండు నూరేళ్లు నిండాయి. వివాహం అయిన రెండు వారాలకే బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని..
Bride Committed Suicide: నవ వధువుకు నిండు నూరేళ్లు నిండాయి. వివాహం అయిన రెండు వారాలకే బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది.21 సంవత్సరాల యువతి 14 రోజుల కిందట మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె అత్తగారింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే నవవధువు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు.