శుక్ర యోగంలో తప్పటడుగులు.. అక్రమ సంబంధాల వైపు ఆ రాశుల వారు ఆకర్షితులు కావొచ్చు.. జర జాగ్రత్త!

గ్రహ సంచారంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉన్నప్పుడు లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కొన్ని మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలను కూడా ఇస్తుంటాడు. వాస్తవానికి ఈ చెడు ఫలితాలు కూడా చాలా రాశుల వారికి సుఖసంతోషాలను ఇస్తుంటాయి.

శుక్ర యోగంలో తప్పటడుగులు.. అక్రమ సంబంధాల వైపు ఆ రాశుల వారు ఆకర్షితులు కావొచ్చు.. జర జాగ్రత్త!
Illegal AffairsImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 17, 2023 | 1:13 PM

గ్రహ సంచారంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉన్నప్పుడు లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కొన్ని మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలను కూడా ఇస్తుంటాడు. వాస్తవానికి ఈ చెడు ఫలితాలు కూడా చాలా రాశుల వారికి సుఖసంతోషాలను ఇస్తుంటాయి. మే నెల రెండవ తేదీ వరకు శుక్ర గ్రహం తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ సంచారం వల్ల వృషభం, సింహం, వృశ్చికం, కుంభరాశి వారికి కొన్ని విచిత్రమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ప్రారంభం కావటం, ప్రేమలు పెళ్లిళ్లకు దారి తీయడం, దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగటం వంటివి సానుకూల ఫలితాలు కాగా.. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెరగటం వంటి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా చోటు చేసుకుంటాయి. అంటే ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటూ తప్పటడుగులు వేయకుండా ఆయా రాశుల వారు జాగ్రత్తపడాలి.
సాధారణంగా జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుక్ర గ్రహానికి బలం పట్టే పక్షంలో అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు ఎక్కువగా అవకాశం ఇస్తాడు. లైంగిక విషయాలకు, శృంగారానికి శుక్ర గ్రహం కారకురాలు కావడం ఇందుకు ప్రధాన కారణం. శుక్ర గ్రహానికి బలం పట్టడం వల్లే సినిమా వంటి కళా రంగాలలో ప్రవేశానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ గ్రహం ఉచ్ఛ స్వక్షేత్రాలలో ఉన్నప్పుడు లేదా ఒకటి, ఐదు, 11 స్థానాలలో ఉన్నప్పుడు అటువంటి జాతకులలో లైంగిక ధ్యాస, కోరిక మోతాదు మించి ఉంటుంది. ఇంతకూ శుక్ర సంచార ప్రభావం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం.
  1. వృషభ రాశి: సాధారణంగా ఈ రాశి వారు ఏకపత్నీ వ్రతులు అయి ఉంటారు. అయితే, ఈ రాశిలో ప్రస్తుతం ఈ రాశి నాధుడైన శుక్రుడు సంచరిస్తున్నందువల్ల కొద్దిగా ధ్యాస మళ్ళే అవకాశం ఉంది. ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకునే సూచనలున్నాయి. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. బాగా పరిచయస్తులైన వారితో గానీ లేదా లేదా బంధు వర్గానికి చెందిన వ్యక్తితో గానీ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ప్రేమ వ్యవహారాలు అంకురించే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. కాగా, అనవసర పరిచయాలకు వీరు ప్రస్తుతానికి దూరంగా ఉండటమే మంచిది. అనవసర పరిచయాల వల్ల, అక్రమ సంబంధాల వల్ల ఈ రాశి వారు రాబోయే రెండు మూడు నెలల కాలంలో ఆర్థికంగా బాగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
  2. సింహ రాశి: పొగడ్తలకు తేలికగా లొంగిపోయే స్వభావం కలిగిన ఈ రాశి వారి జీవితంలోకి జీవిత భాగ స్వామి కాకుండా మరో స్త్రీ ప్రవేశించే అవకాశం ఉంది. సాధారణంగా లైంగిక వాంఛల పట్ల మితిమీరిన వ్యామోహం కలిగిన ఈ రాశి వారు ఈ వివాహేతర సంబంధాన్ని చాలా కాలం పాటు కొనసాగించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానంలో శుక్ర గ్రహం బలంగా సంచరిస్తున్నందువల్ల, ఒక సహచరురాలు వీరి జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మహిళ వల్ల వీరి ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కే అవకాశం కూడా ఉంటుంది. అయితే, ఈ రాశి వారు తమ వ్యక్తిగత కుటుంబ జీవితం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. కుటుంబంలో కలతలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. కొద్దిగా పరువు ప్రతిష్ట లకు భంగం కలిగే సూచనలు ఉన్నాయి.
  3. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన స్థానంలో శుక్ర గ్రహ సంచారం జరుగుతోంది. దీనివల్ల లైంగిక ప్రకోపం ఎక్కువై తప్పుదోవలు పట్టే అవకాశం ఉంది. స్నేహం ముసుగులో పలువురు మహిళలతో సంబంధాలు ఏర్పరచుకునే సూచనలు ఉన్నాయి. లైంగిక సంబంధాలకు సంబంధించి వీరికి ఒక రహస్య జీవితం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా స్నేహితులు లేదా సహచరుల నుంచి ఈ సంబంధాలు ఏర్పడవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ఈ రాశి వారు ఈ ఏడాది కచ్చితంగా ముందడుగు వేస్తారు. ప్రేమలు పెళ్లిళ్లకు దారి తీసే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. కాగా అక్రమ సంబంధాల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖర్చులు పెరిగి కొద్దిగా ఇబ్బందులు పడవలసి వస్తుంది.
  4. కుంభ రాశి: అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు వీలైనంత దూరంగా ఉండాలని నియమంగా పెట్టుకున్న ఈ రాశి వారు ఈ నియమానికి తిలోదకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు నుంచి లేదా బంధు వర్గం నుంచి ఒక మహిళ వీరి జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఈ బంధం శాశ్వతంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు ఒకరిని మించి ఎక్కువమందితో వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశం లేదని చెప్ప వచ్చు. ఈ వివాహేతర సంబంధం ద్వారా ఆర్థి కంగా స్థిరపడటం కానీ, గృహ వసతి ఏర్పడటం కానీ జరగవచ్చు. ఈ రాశి వారు కొత్తగా ప్రేమ వ్యవహారాలలోకి దిగే అవకాశం ఉంది. ఈ ప్రేమ వ్యవహారం తప్పకుండా పెళ్లికి దారితీస్తుంది. దాంపత్య జీవితం కూడా సజావుగా, సాఫీగా సాగిపోతుంది.
  5. ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..