Horoscope Today: ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.. సోమవారం దినఫలాలు..
Horoscope Today (17 ఏప్రిల్ 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం (ఏప్రిల్ 16) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Horoscope Today (17 ఏప్రిల్ 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం (ఏప్రిల్ 16) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలపడుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. వ్యాపారంలోనూ, వృత్తులలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కొత్త ఆలోచనలకు చక్కని ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయటా శక్తికి మించి శ్రమపడతారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఎవరికీ హామీలు ఉండవద్దు. బంధుమిత్రులు అండగా ఉంటారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఉదారంగా సహాయం చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో గౌరవ అభిమానాలు పెంపొందుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్య తలు అప్పగిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ జీవితం ఆనందంగా గడిచిపోతుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట): రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం అంత మంచిది కాదు. కుటుంబ సమస్య ఒకటి చక్కబడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ముఖ్యమైన పనులలో తిప్పట ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ జీవితంలో అపార్ధాలు తలెత్తుతాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయ పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో సంపాదన, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు సహాయంతో ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..