పుట్టిన తేదీ ఆధారంగా మీ ఆర్థిక భవిష్యత్తు తెలుసుకోండి..! ఈ సంఖ్యలో పుట్టినవారికి అదృష్టం ఎప్పుడూ తోడుంటుంది..!
న్యూమరాలజీ మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి, విజయానికి సంబంధించిన విషయాలను అంచనా వేయవచ్చు. కొన్ని సంఖ్యలకు చెందిన వ్యక్తులు సంపదను సులభంగా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.

మీ పుట్టిన తేదీలోని సంఖ్యలను కలిపి ఒకే అంకంగా మార్చితే, మీ ముఖ్యమైన సంఖ్యను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు 5 అనే ముఖ్యమైన సంఖ్యను కలిగి ఉంటారు. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రతీక.
ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఆలోచించకుండా తక్షణమే నిర్ణయాలు తీసుకుంటారు. వీరు సాహసోపేతంగా జీవితం లో అవకాశాలను పట్టుకుని ముందుకు సాగుతారు. ఈ ధైర్యంతో వీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విజయవంతంగా నిర్వహిస్తారు.
ఈ సంఖ్యలో పుట్టినవారు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే శక్తి కలిగినవారు. వీరు ఒకసారి ఏదైనా అర్థం చేసుకుంటే దానిని బాగా ఉపయోగించుకుంటారు. తెలివితేట ఎక్కువగా ఉండడం వల్ల వీరు వివిధ రంగాల్లో సులభంగా స్థిరపడతారు. ముఖ్యంగా డబ్బు సంపాదనలో ముందుంటారు.
ఇతరుల కంటే వీరు తమ పనిపట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. చిన్న ఉద్యోగమైనా, పెద్ద వ్యాపారమైనా పూర్తి నిబద్ధతతో చేస్తారు. దీనివల్ల వీరు ఎప్పుడూ విజయం సాధిస్తారు. వీరు డబ్బును సమర్థంగా ఖర్చు చేసి భవిష్యత్తును మరింత భద్రంగా ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.
ఈ సంఖ్యలో పుట్టినవారికి ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. వీరు కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త వ్యక్తులను కలవాలని కోరుకుంటారు. దీని వల్ల వీరు కొత్త కొత్త అవకాశాలను కూడా గుర్తిస్తారు. వీరి మాట్లాడే తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే వీరు అందరితో సులభంగా కలిసిపోతారు.
ఈ సంఖ్యలో జన్మించినవారు తెలివైన వారు, సాహసోపేతంగా ముందుకు వెళ్లే వారు, డబ్బు సంపాదించడంలో ప్రతిభ కనబరిచే వారు. వీరు జీవితంలో తక్కువ కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగుతారు. సరైన ప్రణాళికతో వెళ్తే వీరు ఆర్థికంగా మరింత స్థిరపడతారు.




