Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (February 26, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలతో పాటు, ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడే అవకాశముంది. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాట రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలతో పాటు, ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాట రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శనులు అనుకూలంగా ఉండడంతో పాటు లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు కుటుంబపరంగా, ధనపరంగా కూడా సమయం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలతో పాటు, ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రాశిలో గురువు, లాభ స్థానంలో రాహువు సంచారం, దశమంలో బుధాదిత్య యోగం ఏర్ప డడం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం, దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కానీ, వృథా ఖర్చుల వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉండే అవకాశం లేదు. ప్రముఖులతో మైత్రి పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశికి లాభ స్థానంలో గురువు, తృతీయంలో కేతువు సంచారం వల్ల ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. సాధారణంగా ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థితిగతులు మరింత మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు శుభ వార్త అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ, లాభ స్థానాలలో వరుసగా గురు, కుజులు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మీ సలహాలు, సూచనలకు అధికారులు ప్రాధాన్యమిస్తారు. జీవిత భాగ స్వామి నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు అండగా ఉంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
భాగ్య స్థానంలో గురువు, దశమ స్థానంలో కుజుడు, ఆరవ స్థానంలో శని ఉన్నంత కాలం ఈ రాశివారికి ధన యోగాలు కలుగుతూనే ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సాఫీగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానం గానే అయినా తప్పకుండా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అయిదవ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడంతో పాటు ఆరవ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు దాదాపు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
పంచమ, సప్తమాధిపతులైన గురు, శుక్రులు పరివర్తన చెందడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయంలో శని, బుధ, రవులు, సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసి లాభం పొందుతారు. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులు కొందరు ఆర్థికంగా మోసగించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, రాశ్యధిపతి శని ధన స్థానంలో, రాహువు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయం కొద్దో గొప్పో పెరగడం తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఇంటాబయటా మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశిలో బుధాదిత్యయోగం ఏర్పడడం, ధన స్థానాధిపతితో చతుర్థ స్థానాధిపతి పరివర్తన చెందడం వల్ల రోజంగా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, రాశినాథుడైన గురువుతో పరివర్తన చెందడం వల్ల ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదా యం వృద్ది చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు.



