AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో జన్మించినవారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..?

సంఖ్యాశాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మించిన తేదీ ద్వారా అతని స్వభావం, లక్షణాలు, ప్రవర్తన, భవిష్యత్తు గురించి అంచనా వేయవచ్చు. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అదృష్టాన్ని అంచనా వేయడానికి ముందుగా మూలాంకం (అంక సంఖ్య) లెక్కించాలి. ఇది 1 నుంచి 9 మధ్యలో ఏదైనా అంకంగా నిర్ణయించబడుతుంది. ప్రత్యేకంగా 7 మూలాంకం కలిగిన వ్యక్తులు లోతైన ఆలోచన చేసేవారు, స్వీయ పరిశీలన చేసే గుణం కలిగి ఉంటారు.

Numerology: ఈ తేదీల్లో జన్మించినవారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..?
Lucky Birth Dates In Numerology
Prashanthi V
|

Updated on: Feb 26, 2025 | 9:56 AM

Share

సంఖ్యాశాస్త్రం ప్రకారం 7, 16, 25 తేదీలలో జన్మించిన వారి మూలాంకం 7 గా నిర్ణయించబడుతుంది. ఈ అంకానికి గ్రహాధిపతి కేతు. కేతు ప్రభావంతో వీరు లోతైన ఆలోచన చేసే వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా విషయాన్ని పూర్తిగా విశ్లేషించాకే నమ్మే స్వభావం వీరిలో కనిపిస్తుంది.

ఈ మూలాంకం కలిగిన వ్యక్తులు ఎక్కువగా అంతర్ముఖంగా ఉంటారు. తన భావాలను ఇతరులతో పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదు. వీరి మౌనం చాలా మంది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇతరుల విషయాల్లో వీరు చాలా ఆసక్తిగా ఉంటారు. ఏదైనా విషయం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఈ అంకంలో జన్మించినవారు సహజంగా అనుమాన స్వభావం కలిగి ఉంటారు. ఏ పని జరిగినా వెంటనే నమ్మరు. ప్రతి విషయాన్ని ఖచ్చితంగా విశ్లేషించి నిజం తెలుసుకునే వరకు ఎదురుచూసి నిర్ణయం తీసుకుంటారు. ఈ అలవాటు చిన్ననాటి నుంచే వారిలో కనిపిస్తుంది. వీరి ఊహాశక్తి చాలా మెరుగైన స్థాయిలో ఉంటుంది.

7 మూలాంకం కలిగినవారు చాలా తెలివైనవారు. వారి నిర్ణయాలు బలంగా, స్పష్టంగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగాలకు చేరే అవకాశం ఎక్కువ. న్యాయ వ్యవస్థలో కూడా వీరు ప్రాముఖ్యత పొందే అవకాశముంది. విషయాలను లోతుగా అర్థం చేసుకుని, తర్కబద్ధంగా విశ్లేషించే శక్తి వీరికి సహజంగా వస్తుంది. అందువల్ల న్యాయమూర్తులుగా ఎదిగే అవకాశాలు వీరికి చాలా ఉంటాయి.

ఈ అంకం వారు మంచి తీర్పు ఇచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. హడావిడి చేయకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కేతు ప్రభావంతో వీరికి మత సంబంధమైన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి వీరిని శాస్త్రీయంగా ఆలోచించేలా మారుస్తుంది.