Jupiter Retrograde: త్వరలో తిరోగమనంలో బృహస్పతి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ 12 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురు బృహస్పతి మే 1, 2024 నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 13, 2025 తర్వాత తన రాశిని మర్చుకోనున్నాడు. అయితే బృహస్పతి అక్టోబర్‌లో తిరోగమనం చేయనున్నాడు. వేద క్యాలెండర్ ప్రకారం బృహస్పతి 2024 అక్టోబరు 9 బుధవారం రోజున వృషభరాశిలో రివర్స్‌గా కదలనున్నాడు. బుధవారం 5 ఫిబ్రవరి 2025 వరకు తిరోగమన స్థితిలో ఉండనున్నాడు గురుడు. ఈ నేపధ్యంలో బృహస్పతి తిరోగమనం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెరుస్తుంది

Jupiter Retrograde: త్వరలో తిరోగమనంలో బృహస్పతి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Jupiter's Retrograde
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2024 | 8:25 PM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలకు రాశులకు విశిష్ట స్థానం ఉంది. నవ గ్రహాలు స్థిర సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాయి. నవ గ్రహాల్లో బృహస్పతి ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. దీంతో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ 12 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురు బృహస్పతి మే 1, 2024 నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 13, 2025 తర్వాత తన రాశిని మర్చుకోనున్నాడు. అయితే బృహస్పతి అక్టోబర్‌లో తిరోగమనం చేయనున్నాడు. వేద క్యాలెండర్ ప్రకారం బృహస్పతి 2024 అక్టోబరు 9 బుధవారం రోజున వృషభరాశిలో రివర్స్‌గా కదలనున్నాడు. బుధవారం 5 ఫిబ్రవరి 2025 వరకు తిరోగమన స్థితిలో ఉండనున్నాడు గురుడు. ఈ నేపధ్యంలో బృహస్పతి తిరోగమనం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెరుస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి ఆనందం, అదృష్టం, జ్ఞానం, కీర్తిని ఇచ్చేవాడు. ఈసారి నవరాత్రి శుభ యాదృచ్చికం కారణంతో పాటు గురుగ్రహం తిరోగమనం కారణంగా వృషభ రాశితోపాటు మరొకొన్ని రాశులకు అదృష్ట తాళాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా ఆరు రాశులకు చెందిన వ్యక్తులు అకస్మాత్తుగా సంపదలో పెరుగుదలను చూస్తారు. వ్యాపారం, వృత్తి కి చెందిన వ్యక్తులు సామాజిక స్థితి, సమాజంలో కీర్తి ప్రతిష్టలను చూస్తారు.

మిధున రాశి: బృహస్పతి తిరోగమనం మిథునరాశికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అన్ని చోట్లా విజయావకాశాలు ఉంటాయి. అదృష్టం వీరికి పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌తోపాటు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బృహస్పతి తిరోగమనం వలన అదృష్టం పూర్తి మద్దతును పొందుతారు. అనవసర ఖర్చుల నుండి ఉపశమనం పొందడం వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో అనేక రెట్లు లాభాలను అందుకుంటారు. కోర్టు కేసుల్లో కూడా ఉపశమనం లభిస్తుంది.

కన్య రాశి: ఈ రాశికి చెందిన ప్రజలు బృహస్పతి తిరోగమన ప్రభావం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. అకస్మాత్తుగా ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులను పొందుతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

వృశ్చికరాశి: బృహస్పతి రివర్స్ కదలిక వలన వృశ్చికరాశి రాశికి చెందిన వ్యక్తులు అపార సంపదను పొందుతారు. ధనవంతులు అవుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అంతేకాదు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఆరవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి సమాజంలో గౌరవం పెరగడంతో పాటు వృత్తి, వ్యాపారాలలో పురోగతిని పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు