AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubh Yogas: అనుకూల గ్రహంగా రాహువు.. ఆ రాశుల వారికి ఆకస్మిక శుభ యోగాలు..

మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మీద శుక్రుడి దృష్టి పడినందువల్ల ఈ వక్రగ్రహం పూర్తిగా మారిపోతుంది. రాహువుకు శుక్రుడు గురువైనందువల్ల రాహువులో పాప లక్షణాలు తగ్గి శుభ లక్షణాలు పెరుగుతాయి. దీనివల్ల కొన్ని రాశులను శుభ ఫలితాలతో బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. అకస్మాత్తుగా శుభ ఫలితాలనివ్వడం, శుభ యోగాలు కలగజేయడం రాహువు లక్షణం.

Shubh Yogas: అనుకూల గ్రహంగా రాహువు.. ఆ రాశుల వారికి ఆకస్మిక శుభ యోగాలు..
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 30, 2024 | 5:46 PM

Share

మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మీద శుక్రుడి దృష్టి పడినందువల్ల ఈ వక్రగ్రహం పూర్తిగా మారిపోతుంది. రాహువుకు శుక్రుడు గురువైనందువల్ల రాహువులో పాప లక్షణాలు తగ్గి శుభ లక్షణాలు పెరుగుతాయి. దీనివల్ల కొన్ని రాశులను శుభ ఫలితాలతో బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. అకస్మాత్తుగా శుభ ఫలితాలనివ్వడం, శుభ యోగాలు కలగజేయడం రాహువు లక్షణం. వచ్చే నెల 18 వరకు రాహువు పాప ఫలితాలు, అశుభ యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల, శుక్రుడి రాశులైన వృషభ, తులా రాశులతో పాటు, కర్కాటకం, కన్య, మీనం, మకర రాశులు అత్యధికంగా లాభాలు పొందడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్న రాహువును వీక్షిస్తున్నందువల్ల, కొద్ది శ్రమతో భారీగా ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూ లంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు లాభదాయక ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కోలుకునే సూచనలున్నాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువు మీద శుక్రుడి దృష్టి పడినందువల్ల విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిర నివాసం లభించే అవకాశం ఉంది. నిరుద్యో గులకు ప్రయత్నాలకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్సడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
  3. కన్య: ఈ రాశిలో ఉన్న శుక్రుడి దృష్టి సప్తమ స్థానంలో ఉన్న రాహువు మీద పడినందువల్ల, కలలో కూడా ఊహించని విధంగా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ధనపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందు తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడి దృష్టి షష్ట స్థానంలో ఉన్న రాహువు మీద పడినందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని, పదోన్నతులు సంపాదించగలుగు తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు భాగ్య స్థానంలో ఉండి రాహువును వీక్షిస్తున్నందువల్ల, ఈ రాశికి చెందిన ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయ త్నాల్లో కూడా విదేశీ సంబంధమే ఖాయం అవుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. పితృమూలక ధన లాభం ఉంటుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశిలో ఉన్న రాహువు మీద సప్తమ స్థానం నుంచి శుక్రుడి దృష్టి పడినందువల్ల, కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..