Viral Video: వింత ప్రేమ ఇది .. తల్లి కోసం చిన్నారిని కిడ్నప్ చేసిన వ్యక్తి .. అమ్మ దగ్గరకు వెళ్లనని కిడ్నాపర్‌ని కౌగిలించుకున్న బాలుడు ..

ఇది రీల్ సీన్ కాదు . . రియల్ సీన్.  14 నెలల క్రితం ఓ బాలుడి అపహరణకు గురయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని కనిపెట్టి చిన్నారిని రక్షించారు. అయితే ఆ చిన్నారి బాలుడి తల్లిదండ్రుల వద్దకు రావడానికి సిద్ధంగా లేడు పైగా కిడ్నాపర్‌ని కౌగిలించుకున్న వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. బాలుడి ఏడుపు చూసి కిడ్నాపర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

Viral Video: వింత ప్రేమ ఇది .. తల్లి కోసం చిన్నారిని కిడ్నప్ చేసిన వ్యక్తి .. అమ్మ దగ్గరకు వెళ్లనని కిడ్నాపర్‌ని కౌగిలించుకున్న బాలుడు ..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2024 | 5:44 PM

అభం శుభం తెలియని చిన్నారులను కిడ్నప్ చేయడం నేరం మాత్రమే కాదు .. తల్లిదండ్రులనుంచి చిన్నారిని విదీయడం పాపం కూడా . . అలా ఓ వ్యక్తి చిన్నారి బాలుడిని కిడ్నాప్  చేశాడు .. కిడ్నపర్ ఆచూకీ తెలుసుకుని బాలుడికి కోసం వెళ్లిన వారికి షాక్ తగిలింది .  ఎందుకంటే ఆ బాలుడి తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని వదలడానికి ఇష్టపడ లేదు .  పైగా అతడిని గట్టిగా కౌగిలించుకుని రక్షణ కోరుతున్నాడు.  ఇది రీల్ సీన్ కాదు . . రియల్ సీన్.  14 నెలల క్రితం ఓ బాలుడి అపహరణకు గురయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని కనిపెట్టి చిన్నారిని రక్షించారు. అయితే ఆ చిన్నారి బాలుడి తల్లిదండ్రుల వద్దకు రావడానికి సిద్ధంగా లేడు పైగా కిడ్నాపర్‌ని కౌగిలించుకున్న వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. బాలుడి ఏడుపు చూసి కిడ్నాపర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

రాజస్థాన్ లోని  జైపూర్‌లోని సంగనేర్ సదర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 14, 2023న, బాలుడు అపహరణ గురించిన సమాచారం పోలీసులకు అందింది. అప్పటికి ఆ చిన్నారి బాలుడి వయసు 11 నెలలు మాత్రమే. నిందితుడిని తనూజ్ చాహర్‌గా గుర్తించారు. యూపీ పోలీస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనూజ్ బాలుడి కిడ్నప్ విషయంపై సస్పెన్షన్‌కు గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

తనూజ్ తన సహచరులతో కలిసి 11 నెలల చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేశాడు. అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు. దాదాపు 14 నెలల తర్వాత ఆగస్టు 27న పోలీసులు నిందితుడిని అలీగఢ్‌ నుంచి అరెస్టు చేసి జైపూర్‌ తీసుకొచ్చారు.

నిందితుడు బాలుడిని అపహరించినప్పటికీ ఎలాంటి హాని చేయలేదు. పైగా పృథ్వీ తన బిడ్డ అని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడు బాలుడి తల్లిని ఎలాగైనా తన దగ్గర వద్దే ఉంచుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కిడ్నప్ అయిన బాలుడు దొరికిన సమాచారం అందిన చిన్నారి తల్లిదండ్రులు అతడిని తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా.. కిడ్నాపర్ తనూజ్‌ను కౌగిలించుకుని ఏడ్చాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి నిరాకరించాడు .  ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?