AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యాలు చేయలేని పనిని 10 నెలల చిన్నారి చేసిందిగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నిలివేత.. ఎందుకంటే

ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నీ చేయలేని పని గాజాలో 10 నెలల చిన్నారి చేసింది. దాదాపు 11 నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని 3 రోజుల పాటు ఆపేందుకు అంగీకారం కుదిరింది. హమాస్, ఇజ్రాయెల్ వేర్వేరు జోన్లలో 3 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని WHO తెలిపింది. అమెరికాతో పాటు పలు అగ్రరాజ్యాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు నెలల తరబడి ప్రయత్నిస్తుండగా.. 10 నెలల పాప ఈ అద్భుతాన్ని చేసింది.

అగ్రరాజ్యాలు చేయలేని పనిని 10 నెలల చిన్నారి చేసిందిగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నిలివేత.. ఎందుకంటే
Israel Hamas WarImage Credit source: Majdi Fathi/NurPhoto via Getty Images
Surya Kala
|

Updated on: Aug 30, 2024 | 4:01 PM

Share

ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నీ చేయలేని పని గాజాలో 10 నెలల చిన్నారి చేసింది. దాదాపు 11 నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని 3 రోజుల పాటు ఆపేందుకు అంగీకారం కుదిరింది. హమాస్, ఇజ్రాయెల్ వేర్వేరు జోన్లలో 3 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని WHO తెలిపింది. అమెరికాతో పాటు పలు అగ్రరాజ్యాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు నెలల తరబడి ప్రయత్నిస్తుండగా.. 10 నెలల పాప ఈ అద్భుతాన్ని చేసింది.

వాస్తవానికి ఆగస్టు 23న 25 సంవత్సరాల తర్వాత గాజాలో పోలియో వైరస్‌ని గుర్తించినట్లు WHO ధృవీకరించింది. గాజాలో 10 నెలల పాప అబ్దుల్ రెహమాన్ టైప్ 2 పోలియో వైరస్ బారిన పడి వికలాంగురాలైంది. అయితే గాజాలో యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో పిల్లలకు పోలియో చుక్కలు వేయడం చాలా కష్టంగా మారిందని.. దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు వెంటనే పోలియో చుక్కలు వేయాలని WHO తెలిపింది.

3 జోన్లలో 3 రోజుల పాటు కాల్పుల విరమణ

3 వేర్వేరు జోన్లలో 3 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ అంగీకరించినట్లు WHO సీనియర్ అధికారి తెలిపారు. గాజా స్ట్రిప్‌లో హమాస్ , ఇజ్రాయెల్ మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించాయి. ఈ మూడు పోలియో నిర్ముల ప్రచారాన నిర్వహిస్తూ ఈ మూడు రోజులు దాదాపు 6 లక్షల 40 వేల మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు WHO అధికారి రిక్ పెప్పర్‌కార్న్ తెలిపారు. ఇందుకోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్పుల విరమణ ఉంటుంది.

3 రోజుల కాల్పుల విరమణ సమయంలో సెంట్రల్ గాజా నుండి పోలియో వ్యాక్సినేషన్ ప్రచారం ప్రారంభమవుతుందని WHO అధికారి రిక్ పెప్పర్‌కార్న్ చెప్పారు. దీని తరువాత దక్షిణ గాజా, ఉత్తర గాజాలో పోలియో ప్రచారం నిర్వహించబడుతుంది. అవసరమైతే నాల్గవ రోజు ప్రతి జోన్‌కు కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిరిందని WHO అధికారి రిక్ పెప్పర్‌కార్న్ చెప్పారు.

కాల్పుల విరమణకు సిద్ధమైన హమాస్-ఇజ్రాయెల్

అయితే ఈ ఆపరేషన్ భవిష్యత్ తరాల భద్రత కోసం అంతర్జాతీయ సంస్థతో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ అధికారి బస్సెమ్ నయీమ్ తెలిపారు. దీంతో గాజా స్ట్రిప్‌లోని దాదాపు 6.5 లక్షల మంది చిన్నారులకు పోలియో నుంచి రక్షణ లభించనుంది. ఇజ్రాయెల్ ఆర్మీ సమన్వయంతో టీకా ప్రచారం నిర్వహించనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ (COGAT)కి చెందిన మానవతా విభాగం బుధవారం తెలిపింది. ఈ సాధారణ కాల్పుల విరమణ గాజాలోని చిన్నారులను టీకా ప్రచారం నిర్వహించబడే వైద్య కేంద్రాలకు తీసుకుని రావడానికి వ్యాక్సిన్ అందించడానికి సహాయపడుతుంది.

గాజాలో దాదాపు 11 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం

అక్టోబర్ 7వ తేదీ 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1,200 మందిని హతమార్చామని, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నామని హమాస్ పేర్కొంది. దీని తరువాత ఇజ్రాయెల్ హమాస్‌పై పెద్ద ఎత్తున సైనిక చర్యను ప్రారంభించింది. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇజ్రాయెల్ దాడులలో సుమారు 40 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు, అయితే రెండు రెట్లు ఎక్కువ మంది గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఆపరేషన్ కారణంగా గాజాలోని దాదాపు మొత్తం జనాభా (23 లక్షల మంది) నిర్వాసితులయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..