మధ్యాహ్నం నిద్రపోవడం సరైనదా? తప్పా? ఆరోగ్యంపై, సంపదపై ప్రభావం చూపుతుందా.. చాణక్యుడు ఏమి చెప్పాడంటే

సాధారణంగా చాలా మందికి రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అటువంటి పరిస్థితిలో మధ్యాహ్నం నిద్రపోతారు. అయితే మధ్యాహ్నం నిద్రపోవాలా? వద్దా..! మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదా కదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమైన ప్రశ్న. దీనికి చాలా మంది తమ సొంత లాజిక్ కూడా చెబుతారు. అయితే ఈ విషయంపై గొప్ప తత్వవేత్త చాణక్యుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.

మధ్యాహ్నం నిద్రపోవడం సరైనదా? తప్పా? ఆరోగ్యంపై, సంపదపై ప్రభావం చూపుతుందా.. చాణక్యుడు ఏమి చెప్పాడంటే
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2024 | 4:37 PM

ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతమైన శరీరానికి 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరమని చెబుతారు. నేటి ఉరుకుల పరుగుల జీవితం.. బిజీ లైఫ్ లో నిద్రించడానికి సరైన సమయం కూడా దొరకడం లేదు. నిద్ర పోవడం కూడా జీవితంలో ఒక సవాలుగా ఉంది. సాధారణంగా చాలా మందికి రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అటువంటి పరిస్థితిలో మధ్యాహ్నం నిద్రపోతారు. అయితే మధ్యాహ్నం నిద్రపోవాలా? వద్దా..! మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదా కదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమైన ప్రశ్న. దీనికి చాలా మంది తమ సొంత లాజిక్ కూడా చెబుతారు. అయితే ఈ విషయంపై గొప్ప తత్వవేత్త చాణక్యుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.

చాణక్యుడు ఏం చెప్పాడంటే

చాణక్యుడు మధ్యాహ్నం నిద్ర గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పగటిపూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని వారు అంటున్నారు. చాణక్యుడు ప్రకారం నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి శ్వాసను ఎక్కువగా తీసుకుంటాడు. కనుక పగటి సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదు. అంతేకాదు మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తుల విజయ స్థాయి కూడా తగ్గుతుందని.. పనితీరులో ఉత్తమ ప్రమాణం ఉండదని చాణక్య చెప్పాడు. అంతేకాదు వీరి శక్తి సామర్థ్యాలు, లక్షణాలు తెరపైకి రావు.

వైద్యులు ఏమి చెప్పారంటే

చాణుక్యుడు మాత్రమే కాదు వైద్యులు కూడా పగటిపూట నిద్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. వైద్యులు ప్రకారం మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. వైద్యులు మధ్యాహ్నం 20-30 నిమిషాలు విశ్రాంతిని తీసుకోమంటూ సిఫార్సు చేస్తారు. అయితే ప్రతిరోజూ 2-3 గంటలు నిద్రపోవడం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల గుండె కొట్టుకోవడంలో క్రమం మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని అనేక విభిన్న అధ్యయనాలలో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు పగటి సమయంలో నిద్రపోయే వ్యక్తులు రాత్రి వేళ నిద్రపోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. రాత్రి త్వరగా నిద్రపోలేరు.. పొద్దున్నే త్వరగా నిద్ర లేవలేరు.

ఇవి కూడా చదవండి

డబ్బుపై కూడా ప్రభావం చూపుతుందా

మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వలన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని ఎక్కడా రాయలేదు. ఇది ఆరోగ్య కోణంలో మాత్రమే మంచిది కాదు. అయితే రోజువారీ జీవితంలో.. వీరి దినచర్య మునుపటిలా ఉండదు. అటువంటి పరిస్థితిలో చాలా మంది రాత్రి సమయంలో తగినంత నిద్ర పొకపోతే.. మధ్యాహ్నం నిద్రించడానికి ఇష్టపడతారు. అయితే ఈ నిద్రకు ఎక్కువ లేదా తక్కువ డబ్బుతో సంబంధం లేదు. అయితే ఎక్కువ మంది మధ్యాహ్నం నిద్రపోవడం ప్రతికూలతను వ్యాపిస్తుందని కూడా నమ్ముతారు. శరీరానికి హాని జరగడమే కాదు, మానసికంగా కూడా మధ్యాహ్నం నిద్రలేచిన తర్వాత వ్యక్తికి అంత సానుకూలంగా అనిపించదు. అందువలన మధ్యాహ్నం నిద్ర అనేక విధాలుగా మంచిగా పరిగణించబడడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు