Vinayaka Chavithi: వినాయక చవితికి ఇప్పటికే నుంచే సన్నాహాలు చేసుకోండి.. ఇవి లేని గణపతి ఆరాధన అసంపూర్ణం..
వినాయక చవితి 7వ తేదీ సెప్టెంబర్ 2024న వచ్చింది. ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటి తీసుకుని వస్తారు. గణపతిని నియమ నిష్టలతో పుజిస్తారు. చవితి నుంచి అనంత చతుర్దశి రోజు వరకూ పూజించి అనంతరం ఆ విగ్రహాన్ని ప్రవహిస్తున్న నీటిలో నిమజ్జనం చేస్తారు. దేశ వ్యాప్తంగా డిల్లీ నుంచి గల్లీ వరకూ గణేష్ ఉత్సవాల వైభవం విభిన్నంగా కనిపిస్తుంది. గణేశుడిని పూజించే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు..
వినాయక చవితి పండగ సమీపిస్తోంది. ఈ రోజున గణేశుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పిల్లలు పెద్దలు పూజిస్తారు. హిందువులు తమ ఇళ్లలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి వినాకుడి జన్మ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి శుభకార్యానికి ముందు ప్రధమ పూజను అందుకునే గణేశుడు ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి రోజున వినాయక చవిటిగా పూజలను అందుకుంటాడు. అయితే గణేశుడిని పూజించే సరైన పద్ధతి ఏమిటో .. చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పూజ కు ముందే అన్ని సన్నాహాలు చేసిన తర్వాత కూడా..పూజకు కావాల్సిన కొన్ని వస్తువులను మరచి పోతారు. పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున పూజ కోసం ముందస్తుగా ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం..
వినాయక చవితి 7వ తేదీ సెప్టెంబర్ 2024న వచ్చింది. ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటి తీసుకుని వస్తారు. గణపతిని నియమ నిష్టలతో పుజిస్తారు. చవితి నుంచి అనంత చతుర్దశి రోజు వరకూ పూజించి అనంతరం ఆ విగ్రహాన్ని ప్రవహిస్తున్న నీటిలో నిమజ్జనం చేస్తారు. దేశ వ్యాప్తంగా డిల్లీ నుంచి గల్లీ వరకూ గణేష్ ఉత్సవాల వైభవం విభిన్నంగా కనిపిస్తుంది. గణేశుడిని పూజించే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు..
మట్టి గణేష్ విగ్రహం
ముందుగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి. తొమ్మిది రోజుల పాటు పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి.
విగ్రహాన్ని ప్రతిష్టించే పీటం
గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి పీటం కూడా అవసరం. దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది. కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. కనుక వినాయకుడిని ప్రతిష్టించే స్థలం శుభ్రంగా ఉండాలి. అదే సమయంలో పీటాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
కలశం కొబ్బరి కాయ
పూజ సమయంలో కలశం , కొబ్బరికాయ కూడా అవసరం. విగ్రహం దగ్గర కలశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇక కలశం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయను ఉంచుతారు.
ఎరుపు వస్త్రం
పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దేవతను ప్రతిష్టించేటప్పుడు విగ్రహానికి ఎర్రటి వస్త్రం ధరింపజేయండి. పీటంపై కూడా ఎరుపు రంగు బట్టని పరచండి.
పత్రీ
వినాయకుని పూజలో పత్రికి ప్రత్యేక స్థానం ఉంది. మామిడి, ఉసిరి, జమ్మి, జామ ఇలా 21 రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు. పత్రిలో దర్భలు తప్పని సరి. ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని. దర్భను దేవుడికి సమర్పించడం వలన సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతారు.
పంచామృతం ,ఉండ్రాళ్ళు
పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి. అంతే కాకుండా గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు అంటే ఇష్టం. కనుక వీటిని తప్పని సరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి.
ఇతర పూజా వస్తువులు
వినాయక విగ్రహానికి దండ, యజ్ఞోపవీతం, పూలు, దీపం, కర్పూరం, తమలపాకులు, పసుపు గుడ్డ, పసుపు, తమలపాకులు, దర్భ గడ్డి, అగరబత్తీలు, కుంకుమ అక్షతలు కూడా ఏర్పాటు చేసుకోవాలి.
వినాయక వ్రత కథ పుస్తకం
వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదువుకుని .. ఆ అక్షతలను తల మీద వేసుకోవాలి. ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసినా నీలాపనిందలు దరిచేరవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు