Polala Amavasya: సోమవతి అమావాస్య రోజున చేసే ఈ ఒక్క పరిష్కారం మీ జీవితాన్ని మారుస్తుంది.. కష్టాలు తీరతాయి
అన్ని అమావాస్యలలో సోమవతి అమావాస్య అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అయితే అమావాస్య తిధి సోమవారం వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఇది శుభ సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం పాటించడం మంచిది. అలాగే ఈ రోజు నదీ స్నానం చేయడానికి, దానధర్మాలు చేయడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రత్యేక చర్యలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది . ఈ రోజున చేసే స్నానం, దానం కు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది శ్రావణ మాసం చివరి రోజైన అమావాస్య సోమవారం వచ్చింది. కనుక ఈ అమావాస్య ను సోమవతి అమావాస్య అని కూడా అంటారు. అరుదైన యాదృచ్చికంతో సోమవతి అమావాస్య సెప్టెంబర్ 2వ తేదీన వస్తుంది. అన్ని అమావాస్యలలో సోమవతి అమావాస్య అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అయితే అమావాస్య తిధి సోమవారం వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఇది శుభ సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం పాటించడం మంచిది. అలాగే ఈ రోజు నదీ స్నానం చేయడానికి, దానధర్మాలు చేయడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రత్యేక చర్యలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
పరిష్కారం ఏది?
సోమవారం శివునికి అంకితం చేయబడిన రోజు. అందుకే సోమవతి అమావాస్య రోజున శివుని పూజిస్తారు. ఈ రోజున గంగా స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. గంగా నదికి వెళ్లలేని పక్షంలో ఏదైనా నదిలోనో, చెరువులోనో, సరస్సులోనో స్నానం చేసి శివుడిని పూజించాలి. ఈ రోజున 108 సార్లు తులసి మొక్కకు ప్రదక్షణ చేయడం కూడా చాలా ప్రయోజనకరం. ఇలా చేయడం వల్ల మనిషికి చెడు రోజులు పోయి మంచి రోజులు వస్తాయి. అంతేకాదు ఈ రోజున మీ పూర్వీకులను స్మరించుకోవడం, దానధర్మాలు చేయడం కూడా చాలా మేలు చేస్తుంది. అంతే కాదు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఓం కారం జపించడం కూడా ఉపశమనం కలిగిస్తుంది.
సోమవతి అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు?
హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఈ రోజున హృదయపూర్వకంగా శివుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు. సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేయండి. ఈసారి సోమవతి అమావాస్య సెప్టెంబర్ 2న ఉదయం 5.21 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 7.24 గంటలకు ముగుస్తుంది. ఈసారి విశేషమేమిటంటే.. ఈ సోమవతి అమావాస్య రోజున రెండు పెద్ద యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటి శివయోగం, రెండోది సిద్ధియోగం. ఈ యోగ సమయంలో మనం మన పూర్వీకులను స్మరించుకుని దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. వారిపై భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు