కలలో ఈ ఐదు వస్తువులు కనిపిస్తే మంచి రాబోతున్నాయని అర్ధం.. ఇంట్లో కనక వర్షం కురుస్తుందట

ఒకొక్కసారి అకస్మాత్తుగా లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొంది సడెన్ గా ధనవంతుడు కావడం చాలా సార్లు గమనించవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కలలు కంటారు. ఆ కలల్లో అనేక రకాల వస్తువులను, జంతువులు, పక్షులు వంటి వాటిని చూస్తారు. ఎవరి కలలోనైనా సరే ఈ 5 విషయాలు కనిపిస్తే వారికి మంచి రోజులు రానున్నాయని.. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కలలో ఈ ఐదు వస్తువులు కనిపిస్తే మంచి రాబోతున్నాయని అర్ధం.. ఇంట్లో కనక వర్షం కురుస్తుందట
Swapna Sastra
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2024 | 11:24 AM

హిందువులు లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న చోట సంపద వర్షం కురుస్తుందని నమ్ముతారు. ఎవరికైనా ఎప్పుడూ ఆర్థిక సమస్యలుండటం చాలాసార్లు చూసే ఉంటారు. అయితే ఒకొక్కసారి అకస్మాత్తుగా లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొంది సడెన్ గా ధనవంతుడు కావడం చాలా సార్లు గమనించవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కలలు కంటారు. ఆ కలల్లో అనేక రకాల వస్తువులను, జంతువులు, పక్షులు వంటి వాటిని చూస్తారు. ఎవరి కలలోనైనా సరే ఈ 5 విషయాలు కనిపిస్తే వారికి మంచి రోజులు రానున్నాయని.. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

గుడ్లగూబ: గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. లక్ష్మీదేవి సంపదకు దేవతగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఎవరి కలలోనైనా గుడ్లగూబను చూసినట్లయితే వారు జీవితంలో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని.. లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం వారిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి. స్వప్న శాస్త్రంలో గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పాము: కలలో పాము కనిపిస్తే అశుభం అని చాలా మందికి అపోహ ఉంది. అయితే అది అస్సలు నిజం కాదు. పామును చూడటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి కలలోనైనా పాము కనిపిస్తే అది ఏ స్థితిలో, ప్రదేశంలో ఉందో అన్నదానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరి కలలోనైనా కలుగు చుట్టూ ఉన్నట్లు పాము కనిపించినట్లయితే.. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. అది డబ్బు రావడానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

గరుడ పక్షి: గరుత్మంతుడు ఈ జగత్తును పోషించే విష్ణువు వాహనంగా పరిగణించబడుతున్నాడు. ఎవరి కలోనైనా ఎప్పుడైనా గరుడుడి కనిపిస్తే విష్ణువు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. కలలో గరుడ దేవుడిని చూస్తే త్వరలో జీవితంలో ధనవంతులు అవుతారని నమ్ముతారు.

బంగారం: కలలో బంగారం కనిపిస్తే కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అర్థం చేసుకోండి. అంతేకాదు కలలో బంగారాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలోకి లక్ష్మీదేవి రాకగా చిహ్నంగా భావిస్తారు. కలలో బంగారం కనిపిస్తే ఇంట్లో త్వరలో కనక వర్షం కురుస్తుందని నమ్ముతారు.

దీపం: హిందూ మతంలో దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంత మంది రోజూ పూజ గదిలో, పండుగ సమయంలో ఖచ్చితంగా దీపం వెలిగిస్తారు. ఎవరి కలలోనైనా వెలుగుతున్న దీపం కనిపిస్తే, అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. సదరు వ్యక్తికి మంచి రోజులు రానున్నాయని.. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య నుండి బయటపడగలడని నమ్మకం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే