AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khatu Shyam Ji: ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ.. కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..

ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. అతను మరెవరో కాదు.. పాండవుల వారసుడే ఖాతు శ్యామ్. భీముని మనవడు.. ఘటోత్కచ్ కుమారుడు. అసలు పేరు బర్బరీకుడు. పురాణా కథల ప్రకారం.. బర్బరీకుడు బాల్యం నుంచి గొప్ప ధైర్యవంతుడు. యోధుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో బర్బరీకుడు చేసిన ప్రాణ త్యాగానికి వరంగా కలియుగంలో ఖాతు శ్యామ్ జీగా పూజించే వరం శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చాడు.

Khatu Shyam Ji: ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ.. కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
Khatu Shyam Ji
Surya Kala
|

Updated on: Aug 24, 2024 | 9:26 AM

Share

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఖతు శ్యామ్ జీ ప్రసిద్ధ ఆలయం ఉంది. ఆయనను కలియుగ దైవంగా భావించి పూజిస్తారు. ఖాతు శ్యామ్ జీ ఆలయం హిందువులకు ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు ఖతు శ్యామ్ జీ దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఖతు శ్యామ్ జీపై ప్రజలకు రోజు రోజుకీ నమ్మకం పెరుగుతోంది. అందుకు నిదర్శనంగా భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజల ఇళ్లలో, వాహనాల మీద అతని ఫోటోలు మెడలోలాకెట్లు లేదా అతనిని కీర్తిస్తూ “హరే కా సహారా, బాబా ఖాతు శ్యామ్ హమారా” అనే నినాదాన్ని వినడం ద్వారా ఈ విషయం స్పష్టం అవుతుంది.

అన్నింటికంటే ఖతు శ్యామ్ పేరు ముందు హరే అని ఉపయోగిస్తున్నారు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ పదానికి భక్తుల బాధలను తొలగించే దైవం అని అర్ధం. ఈ అయితే ఖతు శ్యామ్ జీ కి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయాన్ని 1720లో అభయ్ సింగ్ పునర్నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం గా ఖతు శ్యామ్ జీ అనే పేరుతో భీముని మనవడు, ఘటోత్కచుని ముగ్గురు కుమారులలో పెద్దవాడు పూజలను అందుకుంటున్నాడు.

ఖతు శ్యామ్ జీ ఎవరంటే

ఇవి కూడా చదవండి

ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. అతను మరెవరో కాదు.. పాండవుల వారసుడే ఖాతు శ్యామ్. భీముని మనవడు.. ఘటోత్కచ్ కుమారుడు. అసలు పేరు బర్బరీకుడు. పురాణా కథల ప్రకారం.. బర్బరీకుడు బాల్యం నుంచి గొప్ప ధైర్యవంతుడు. యోధుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో బర్బరీకుడు చేసిన ప్రాణ త్యాగానికి వరంగా కలియుగంలో ఖాతు శ్యామ్ జీగా పూజించే వరం శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చాడు.

యుద్ధంలో ఓడిపోయే వారికే తన మద్దతు అని అన్న బర్బరీకుడు.. ఎందుకంటే

మహాభారత కథ ప్రకారం కురుక్షేత్ర యుద్ధం సమయంలో.. భీముని మనవడు అయిన బర్బరీకుడు కూడా యుద్ధంలో పాల్గొనాలనుకున్నాడు. అయితే బర్బరీకుడు తన తాతలైన పాండవుల పక్షాన లేదా కౌరవుల పక్షాన యుద్ధం చేయాలనీ భావించలేదు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయే పక్షానికి మాత్రమే మద్దతు ఇస్తానని .. వారి తరుపున యుద్ధం చేస్తానని బర్బరీకుడు తన తల్లికి వాగ్దానం చేశాడు. యుద్ధంలో కౌరవులు ఓటమి దిశగా అడుగు వేస్తూ.. పాండవుల ముందు బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు.. బర్బరీకుడు తన తల్లి అనుమతి తీసుకొని ఓడిపోయిన కౌరవుల తరపున పోరాడాలని నిర్ణయించుకున్నాడు. బర్బరీకుడు గొప్ప యోధుడు, కౌరవుల తరపున పోరాడి ఉంటే పాండవులు ఖచ్చితంగా ఓడిపోయేవారు.

శ్రీ కృష్ణ భగవానుడికి బర్బరీకుడు గురించి అతని శక్తి గురించి బాగా తెలుసు, అందుకే శ్రీ కృష్ణుడు .. కౌరవుల తరపున యుద్ధంలో అతని పాల్గొనకుండా చేయాలనుకున్నాడు. బర్బరీకుడు యుద్ధం చేయడానికి ముందు.. శ్రీ కృష్ణుడు బ్రాహ్మణ వేషం ధరించి బర్బరీకుడు తలను దానంగా ఇవ్వమని అడిగాడు. గొప్ప యోదుడైన బర్బరీకుడు ఎటువంటి సంకోచం లేకుండా తన తలను నరికి శ్రీకృష్ణునికి దానంగా ఇచ్చాడు. అప్పుడు అతని ప్రాణత్యాగానికి శ్రీకృష్ణుడు కలియుగ దైవంగా తన పేరుతొ పూజలను అందుకునే వరాన్ని ఇచ్చాడు.

బర్బరీకుడు భీముని మనవడు అయినప్పటికీ పాండవులవైపు పోరాడాలని కోరుకోలేదు. అందుకు బదులుగా ఓడిపోతున్న, బలహీనంగా మారుతున్న వైపు ఎంచుకున్నాడు. అందుకే నేటికీ ఖాతు శ్యామ్ జీ ఆలయానికి ఓడిపోయే వారు వెళ్లి దర్శనం చేసుకుని పూజలు చేస్తారు.భ క్తుడు ఏదైనా కోరికతో ఖాతు శ్యామ్ వద్దకు వెళితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు