Krishnashtami 2024: కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం, శుభముహర్తం ఏమిటంటే..

దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అష్టమి తిధి రెండు రోజులు అంటే మిగులు, తగులుగా వచ్చింది. దీంతో ఈ రోజు జన్మాష్టమిని ఏ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం..

Krishnashtami 2024: కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం, శుభముహర్తం ఏమిటంటే..
Krishnashtami 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2024 | 7:32 AM

హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా వైభవంగా జరుపుకునే పండగ శ్రీ కృష్ణ జన్మాష్టమి. కృష్ణుడి పుట్టిన రోజుని కృష్ణాష్టమి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు స్థితి కారుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణు మూర్తి వివిధ అవతారాలను దాల్చాడు. అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి. ఈ దశావతారాల్లో 8వ అవతారం శ్రీ కృష్ణుడు అని నమ్మకం. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా మహా విష్ణువు జన్మించాడని పురాణ కథనం. దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అష్టమి తిధి రెండు రోజులు అంటే మిగులు, తగులుగా వచ్చింది. దీంతో ఈ రోజు జన్మాష్టమిని ఏ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం..

2024 జన్మాష్టమి ఎప్పుడంటే

వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి ఈ నెల 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమావుతుంది. మర్నాడు అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 2:19 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం మధ్యాహ్నం 03:55 గంటలకు మొదలవుతుంది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు రోహిణి నక్షత్రం ముగుస్తుంది. కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26న జరుపుకోవాలా, ఆగస్టు 27న జరుపుకోవాలా అన్న సందేశం చాలా మందిలో ఉంది. ఈ సందేశాలకు సమాధానం పండితులు చెప్పారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమిగా రెండు రకాలుగా జరుపుకుంటారని.. అందులో కొందరు ఈ పర్వదినాన్ని రెండు రోజుల పాటు జరుపుకుంటారని చెబుతున్నారు. ..

ఇవి కూడా చదవండి

స్మార్త కృష్ణాష్టమిలో ఎప్పుడు పూజ చేయాలంటే

శివ కేశవులను పూజించే వారిని స్మార్తులంటారు. అంతేకాదు ఆది శంకరాచార్యులను ఆరాధించే వారిని కూడా స్మార్తులు అని అంటారు. వీరు కృష్ణాష్టమి పండగను ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోవాలని చెబుతున్నారు. ఎదుకంటే వీరికి జన్మాష్టమి జరుపుకోవడానికి సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలన్న నియమం లేదు. ఆ రోజులో ఎపుడు రోహిణి నక్షత్రం ఉన్నా చాలు ఈ వేడుకను జరుపుకోవడానికి..

వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకునే సంప్రదాయం ఏమిటంటే..

కేవలం వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు 27 మంగళవారం నాడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. ఎందుకంటే వీరికి కన్నయ్యను పూజించడానికి అష్టమి తిధి సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉండాలి. అందుకనే విష్ణువుని మాత్రమే పూజించే వైష్ణవులు కృష్ణాష్టమిని ఆగష్టు 27వ తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు.

రెండురోజులు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునే వారు

ఆగస్టు 26న కృష్ణాష్టమిని జరుపుకోవాలి. ఈ రోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి.. బాల కృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి. రకరకాల పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, అటుకులతో పాటు రకరకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాల మధ్యలో కృష్ణుడికి పూజ నిర్వహించాలి. ఇక ఆగస్టు 27న ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వీధుల్లో ఉట్లు కట్టి దానిని కొట్టడానికి పోటీపడతారు. అందుకే క్రిష్ణష్టమిని ఉట్ల పండగ అని కూడా అంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు.. ఉత్తరప్రదేశ్ లోని మధుర-బృందావనంలో మాత్రం వెరీ వెరీ స్పెషల్. కృష్ణుడు జన్మించిన ప్రాంతం మధుర అయితే.. బాల్యాన్ని ఎక్కువుగా గడిపిన ప్రాంతం బృందావనం అని హిందువుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?