- Telugu News Photo Gallery Spiritual photos Ganesh Chaturthi 2024: When Is Ganesh Chaturthi 2024 Know Date Time Shub Muhurat And Importance
Ganesh Chaturthi: గణపతి ఉత్సవం ఎప్పుడు? విగ్రహ ప్రతిష్టకు సరైన పద్ధతి, నియమాలను తెలుసుకోండి.
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలోకి అడుగు పెట్టనున్నాం. దీంతో విఘ్నాలకాధిపతి వినాయకుడి జన్మదినం అయిన వినాయక చవితి వేడుకలను జరుపుకోవడానికి హిందువులు రెడీ అవుతున్నారు. ఈ నేపద్యంలో గణపతి నవరాత్రులు లేదా గణేష్ ఉత్సవం ఎప్పుడు ప్రారంభమవుతుంది? గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సరైన విధానం, నియమాలను తెలుసుకుందాం.. వినాయక చవితి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. ఈ వినాయకుని పండుగ 10 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు గణేశ విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి ఉత్సవాలు మొదలై నిమజ్జనంతో పండుగ పూర్తవుతుంది.
Updated on: Aug 24, 2024 | 8:02 AM

వినాయక చవితి తేదీ , పూజ శుభ సమయం: వైదిక క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి శుక్రవారం సెప్టెంబర్ 6, 2024న ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7, శనివారం సాయంత్రం 5.37 గంటలకు ముగుస్తుంది. దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరుపుకోవాలని, మరికొందరు 8వ తేదీ జరుపుకోవాలని చెబుతుండటంతో మరోసారి సందిగ్ధత నెలకొంది. అయితే ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం: ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి జరుపుకోవాలి. దీంతో పాటు ఉదయం 11.04 గంటల నుంచి మధ్యాహ్నం 1.34 గంటల వరకు విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భక్తులకు మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.

నిమజ్జనం తేదీ: గణేష్ ఉత్సవం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం ప్రారంభమవుతుంది. ఈసారి గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తాయి. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి 10 రోజుల పాటు పూజించే వారు అనంత చతుర్దశి నాడు వినాయకుని నిమజ్జనం చేస్తారు.

Ganesh Chaturthi 2024

ఆ వినాయకుడి విగ్రహం చేతిలో పవిత్రమైన దారం ఉండాలి. ఎలుక కూడా ఉండాలి. గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. గణేశుడి విగ్రహం ముఖం పశ్చిమం వైపు ఉండాలి. నిమజ్జనానికి ముందు విగ్రహాన్ని ఆ ప్రదేశం నుండి అస్సలు తొలగించకూడదు.




