Chanakya Niti: ఏ వస్తువులు దానం చేయడం విశేష ఫలితాలు..! ఏవి దానం చేయకూడదంటే

చాణక్య నీతిలో దాన ధర్మం గొప్ప ప్రాముఖ్యత గురించి వివరించబడింది. చాణుక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యాన్ని బట్టి దానం చేయాలి. దానం చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దానం చేసే సమయంలో ఆలోచించ కూడదు. క్రమం తప్పకుండా దానం చేసే అలవాటును పెంచుకోవాలి.

Chanakya Niti: ఏ వస్తువులు దానం చేయడం విశేష ఫలితాలు..! ఏవి దానం చేయకూడదంటే
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2024 | 2:18 PM

జీవించడం ఒక ఆర్ట్. వ్యక్తి వ్యక్తి తమ జీవితం గడిపే విధానంలో తేడా ఉంటుంది. ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి తన జీవితాన్ని గడుపుతాడు. అదే సమయంలో వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి ప్రజలకు సహాయం చేయాలని సనాతన ధర్మం నమ్మకం. ఇది మానవత్వపు అనుభూతిని కలిగిస్తుంది. చాణక్య నీతిలో దానం గురించి కూడా వివరంగా వివరించబడింది. దానం ప్రాముఖ్యతను వివరించబడింది. చాణక్య నీతిలో దాతృత్వం అనేది మానవ చేతులకు అలంకారంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి ఎవరికి దానం చేయాలి? దానం చేయదగిన వస్తువులు ఏమిటో చెప్పారు..

దానం అవసరం చాణక్య నీతిలో దాన ధర్మం గొప్ప ప్రాముఖ్యత గురించి వివరించబడింది. చాణుక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యాన్ని బట్టి దానం చేయాలి. దానం చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దానం చేసే సమయంలో ఆలోచించ కూడదు. క్రమం తప్పకుండా దానం చేసే అలవాటును పెంచుకోవాలి.

ఎవరు దానం చేయాలంటే దానం ఎల్లప్పుడూ అవసరంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. అవసరం లేకుండా ఎవరికీ దానం చేయకూడదు. అలాగే డబ్బును దుర్వినియోగం చేసే వారికి ఎప్పుడూ దానం చేయకూడదు. అంతే కాకుండా దురాశ పరులకు, స్వార్థ పరులకు దానం చేయకూడదు. అయితే శక్తి ప్రకారం దేవాలయం లేదా అనేక విభిన్న సంస్థలలో కూడా విరాళం ఇవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏమి దానం చేయాలంటే దానం చేసేటప్పుడు ఏ రోజు ఏమి దానం చేయాలి అనేది గుర్తుంచుకోవాలి. అదే సమయంలో దానం చేయకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. స్టీల్ వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు. ఇలా స్టీల్ వస్తువులు దానం చేయడం వలన ఆనందం, సంపద కోల్పోతుంది. కుటుంబంలో అసమ్మతిని సృష్టిస్తుంది. గోవును దానం చేయవచ్చు, నెయ్యి దానం చేయవచ్చు, వస్త్రం, నువ్వులు, బెల్లం దానం చేయడం విషేశ ఫలితాలను ఇస్తుంది. వీటిని దానం చేయడానికి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. హిందూ మతంలో గోవు దానం అత్యుత్తమ దానంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు