AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnashtami 2024: కన్నయ్య తలలో నెమలి పింఛం పెట్టుకోవడానికి కారణాలు ఇవే..

ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున అత్యంత వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ జన్మాష్టమి ఆగష్టు 26వ తేదీ వచ్చింది. ఈ రోజున ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. చిన్న పిల్లలను కృష్టుడిలా అలంకరించి సంబర పడిపోతారు. ఎక్కడ చూసినా ఆనందంగా, కోలాహలంగా ఉంటుంది. కృష్ణుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అదే విధంగా కృష్ణయ్యను పూజించే సమయంలో..

Krishnashtami 2024: కన్నయ్య తలలో నెమలి పింఛం పెట్టుకోవడానికి కారణాలు ఇవే..
Krishnashtami 2024
Chinni Enni
|

Updated on: Aug 23, 2024 | 1:37 PM

Share

ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున అత్యంత వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ జన్మాష్టమి ఆగష్టు 26వ తేదీ వచ్చింది. ఈ రోజున ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. చిన్న పిల్లలను కృష్టుడిలా అలంకరించి సంబర పడిపోతారు. ఎక్కడ చూసినా ఆనందంగా, కోలాహలంగా ఉంటుంది. కృష్ణుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అదే విధంగా కృష్ణయ్యను పూజించే సమయంలో ఎంతో అందంగా అలంకరణలు కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగానే కన్నయ్యకు అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా ఎంతో చక్కగా, అందంగా కనిపిస్తాడు. కృష్ణయ్య అందాన్ని పెంచడంలో నెమలి పింఛం కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఎందుకు ఎప్పుడూ నెమలి పింఛాన్ని తలలో ధరిస్తాడనే.. సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాధ మీద ప్రేమ కారణంగా..

కన్నయ్యకు రాధకు ఉండే బంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. రాధాకృష్ణుల ప్రేమ అనంతం. రాధ అంటే కృష్ణయ్యకు చాలా ఇష్టం. రాధ మీద ప్రేమ కారణంగానే కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటాడట. పురాణాల ప్రకారం.. రాధ ప్యాలెస్‌లో చాలా నెమళ్లు ఉండేవట. ఒకసారి కృష్ణ వేణువు వాయిస్తూ ఉండగా.. రాధ ట్యాన్స్ చేయడం ప్రారంభించిందట. రాధతో పాటు నెమళ్లు కూడా పారవశ్యంతో నృత్యం చేశాయట. ఈ క్రమంలోనే ఒక నెమనలి ఈక డ్యాన్స్ చేస్తుండగా.. కింద పడింది. దాన్ని తీసుకుని కృష్ణుడు తలలో పెట్టుకున్నాడట. అప్పటి నుంచి రాధ ప్రేమకు గుర్తుగా నెమలి ఈకను ధరిస్తాడట.

శత్రువుకు కూడా తన జీవితంలో చోటు..

కృష్ణుడు సోదరుడు బలరామ్ శేషనాగ్ అవతారమని పురాణాలు చెబుతున్నాయి. నెమలి, పాము అనేవి శత్రువులు. ఈ రెండింటికీ అస్సలు పడదు. కానీ ఎవరినైనా ఒకటి చేసే తత్వం కన్నయ్యకు ఉంది. అయితే కృష్ణుడు నుదుటిపై ఉన్న నెమలి ఈక శత్రువుకు కూడా తన జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుందనే సందేశాన్ని ఇస్తుంది.