Janmashtami 2024: ఆర్ధిక ఇబ్బందులా కృష్ణ జన్మాష్టమి రోజు రాత్రి ఈ చర్యలు చేయండి .. శుభ ఫలితాలు మీ సొంతం

కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడికి హారతిని ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాతే జన్మాష్టమి వ్రత దీక్షను విరమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మాష్టమి రోజు రాత్రి కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయని, అతను జీవితంలో సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సు పొందుతాడని నమ్ముతారు.

Janmashtami 2024: ఆర్ధిక ఇబ్బందులా కృష్ణ జన్మాష్టమి రోజు రాత్రి ఈ చర్యలు చేయండి .. శుభ ఫలితాలు మీ సొంతం
Krishna Janmashtami Puja
Follow us

|

Updated on: Aug 23, 2024 | 1:31 PM

హిందూ మతంలో జన్మాష్టమి పండుగను భక్తి, ఆనందంతో జరుపుకుంటారు. ఈ పండుగ శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. కృష్ణ జన్మాష్టమిని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని బాల రూపమైన లడ్డూ గోపాలునికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు. కన్నయ్య జన్మదినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లోని కృష్ణుడి దేవాలయాలను అలంకరిస్తారు. శ్రీకృష్ణుడితో పాటు బాల రూపమైన బాలా గోపాలుడిని అందంగా అలంకరించి కొత్త బట్టలు ధరింపజేస్తారు. అంతేకాదు కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడికి హారతిని ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాతే జన్మాష్టమి వ్రత దీక్షను విరమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మాష్టమి రోజు రాత్రి కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయని, అతను జీవితంలో సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సు పొందుతాడని నమ్ముతారు.

జన్మాష్టమి రోజున చేయాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే..?

  1. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాల రూపమైన లడ్డూగోపాలునికి దక్షిణవర్తి శంఖంతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత కృష్ణ చాలీసా లేదా విష్ణు సహస్ర నామాలను పఠించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడి జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం.
  2. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే జన్మాష్టమి రోజున రాత్రి 12 గంటల తర్వాత శ్రీకృష్ణుని ఆరాధన సమయంలో తప్పకుండా తమలపాకులను సమర్పించండి. దీని తరువాత, మరుసటి రోజు ఆ తమలపాకుపై పసుపుతో శ్రీయంత్రాన్ని తయారు చేసి.. దానిని సురక్షితంగా లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందడంతో పాటు సంపద కూడా పెరుగుతుంది.
  3. జన్మాష్టమి రోజు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణునికి ఇష్టమైన వెన్న, మిఠాయిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, సుఖ సంతోషాలు లభిస్తాయని శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఈ పరిష్కారంతో వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
  4. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున చెక్క వేణువును కొని శ్రీ కృష్ణునికి సమర్పించండి. శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. కనుక వేనువుని కూడా సమర్పించవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. అంతేకాదు కృష్ణాష్టమి రోజున క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరే: పరమాత్మనే ప్రణత: క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని విశేష ఆశీర్వాదం లభిస్తుంది. సాధకుడు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు.
  7. ఐశ్వర్యం,శ్రేయస్సు కోసం ఈ రోజున శ్రీకృష్ణునికి పసుపు బట్టలు సమర్పించండి. అంతేకాదు కృష్ణాష్టమి రోజున పూజ చేసే సమయంలో పసుపు దుస్తులు ధరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు