Viral Video: స్మశానంలో తల్లి సమాధి దగ్గర రా అమ్మా అంటూ విలపిస్తున్న చిన్నారి బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

తల్లి లేకుండా పిల్లలు క్షణ కాలం కూడా ఉండలేరు. ఎంత మంది ఉన్నా.. ఎవరు వచ్చినా, ఎంత ఇచ్చినా, అమ్మ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. అమ్మని కోల్పోయిన వారి భాదను తీర్చలేరు. ఈ విషయం మరోసారి రుజువు చేస్తున్నాడు ఓ చిన్నారి బాలుడు. అమ్మ రామ్మా అంటూ తల్లిని పోగొట్టుకున్న ఓ చిన్నారి తల్లి సమాధి ముందు కూర్చుని అమ్మా.. ఓ అమ్మా... అంటూ విలపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం హృదయాన్ని కదిలిస్తోంది. కరిగిస్తోంది.

Viral Video: స్మశానంలో తల్లి సమాధి దగ్గర రా అమ్మా అంటూ విలపిస్తున్న చిన్నారి బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2024 | 1:09 PM

సృష్టిలో తల్లిప్రేమ వెలకట్టలేనిది. పశుపక్ష్యాదుల్లోనైనా మనుషులలోనైనా అమ్మ ప్రేమని తెలియజేసే ఎన్నో సంఘటలను గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఒక తల్లి వంద మంది పిల్లలని పెంచుతుంది అన్న సామెత గురించి తెలిసిందే.. పిల్లల కోసం వారి ఉన్నతి కోసం ఎన్నో కష్టనష్టాలను భరించే అమ్మ లేక పొతే ఆ పిల్లల జీవితం కష్టాల మయం. అందుకనే అమ్మకు ప్రధమ స్థానం ఇస్తూ మాతృదేవో భవ అంటూ కీరిస్తున్నాం.. అవును పిల్లలకు తల్లే సర్వస్వం. అమ్మ ఒక్క క్షణం కనిపించకపోతే పిల్లలు తల్లడిల్లిపోతారు. అమ్మ దగ్గర లేక పొతే అల్లాడుతూ వేదికేస్తారు. తల్లి లేకుండా పిల్లలు క్షణ కాలం కూడా ఉండలేరు. ఎంత మంది ఉన్నా.. ఎవరు వచ్చినా, ఎంత ఇచ్చినా, అమ్మ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. అమ్మని కోల్పోయిన వారి భాదను తీర్చలేరు. ఈ విషయం మరోసారి రుజువు చేస్తున్నాడు ఓ చిన్నారి బాలుడు. అమ్మ రామ్మా అంటూ తల్లిని పోగొట్టుకున్న ఓ చిన్నారి తల్లి సమాధి ముందు కూర్చుని అమ్మా.. ఓ అమ్మా… అంటూ విలపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం హృదయాన్ని కదిలిస్తోంది. కరిగిస్తోంది.

ఈ వీడియోను యశోధ పూజారి (yashodha_poojary_journalist) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అయిన వీడియోలో చిన్నారి బాలుడు తన తల్లి సమాధి ముందు కూర్చుని విలపిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. తన తల్లి చనిపోయిన తరువాత ఈ చిన్న పిల్లవాడు అమ్మ సమాధి వద్దకు వెళ్లి, దాని దగ్గర కూర్చుని అమ్మా.. అమ్మా.. అని పిలుస్తూనే ఉన్నాడు. ఈ దృశ్యం పాషాణ హృదయాన్ని కూడా ద్రవింపజేస్తుందని కామెంట్ జత చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి నాలుగున్నర లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూసిన చూపరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అమ్మ ప్రేమ అంటే అంతే మరి.. ఆ బాధను ఎవరూ తీర్చలేరు. చిన్నారిని చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే