Vinayaka Chavithi: వినాయక చవితి సెప్టెంబర్ 7 లేదా 8నా? విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ, శుభ సమయం, పుజావిధానం మీ కోసం

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చవితి రోజున హిందువుల ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి వైభవంగా చవితి పూజను చేస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేశుడిని ప్రతిష్టించి నియమ నిష్టలతో ఆచారాలతో పూజిస్తారు. గణపతి బప్పా అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని విశ్వాసం. ఈ పండుగ 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున గణపతి బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

Vinayaka Chavithi: వినాయక చవితి సెప్టెంబర్ 7 లేదా 8నా? విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ, శుభ సమయం, పుజావిధానం మీ కోసం
కుడుములు: గణేశుడి నైవేద్యం పెట్టె ఆహార పదార్ధాలలో తప్పనిసరిగా మోదకం అంటే కుడుములు ఉండాలి. పార్వతిదేవి తన బుజ్జి గణపయ్యకు రుచికరమైన కుడుములు తినిపించిందని హిందువులు నమ్ముతారు. అప్పటి నుండి కుడుములు వినాయకుడికి ఇష్టమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశ పూజలో తప్పనిసరిగా కుడుములు నైవేద్యంగా పెడతారు.
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 27, 2024 | 11:27 AM

హిందూ మతంలో శివ పార్వతుల తనయుడు గణపతి జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ గణపతి బప్పా అంటే గణేశుడికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే మహారాష్ట్రలోని ముంబై, హైదరాబాద్ లో జరిగే గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను గణపతి నవరాత్రులుగా..10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చవితి రోజున హిందువుల ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి వైభవంగా చవితి పూజను చేస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేశుడిని ప్రతిష్టించి నియమ నిష్టలతో ఆచారాలతో పూజిస్తారు. గణపతి బప్పా అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని విశ్వాసం. ఈ పండుగ 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున గణపతి బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7 లేదా 8 ఎప్పుడంటే

వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉపవాసం చేస్తారు. వినాయక చవితి 2024 విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం (గణేష్ చతుర్థి 2024 శుభ ముహూర్తం

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ చతుర్థి పూజలు, విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 1.34 గంటల వరకు ఉంటుంది. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన వినాయక ఆరాధనకు విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం 2 గంటల 31 నిమిషాల పాటు శుభ ముహర్తం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించడం మంచిది.

వినాయక చవితి ముగింపు తేదీ

ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున గణేష్ చతుర్థి ముగుస్తుంది. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి 10 రోజుల పాటు పూజించే వారు అనంత చతుర్దశి రోజున వినాయకుని నిమజ్జనం చేస్తారు.

వినాయక చవితి రోజున ఏర్పడనున్న శుభ యోగం

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున అనేక శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ రోజున చిత్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, బ్రహ్మయోగం, ఇంద్ర యోగంతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ రోజు చిత్త నక్షత్రం మధ్యాహ్నం 12.34 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. దీంతో పాటు ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12:34 నుంచి ఉదయం 6:15 వరకు ఉంటుంది.

గణపతి విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్టించాలంటే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మధ్య కాలంలో ఏదైనా శుభ సమయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించండి. ప్రతిష్టించే వినాయకుడి విగ్రహానికి కుడి వైపున తొండం ఉండాలి. ఇలా ప్రతిష్టించే విగ్రహం దగ్గర ఎలుక ఉండాలి. వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండాలి. వినాయకుని విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రతిష్టించాలి. ఈ ప్రదేశం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. గణేశుడి విగ్రహం పశ్చిమం వైపు ఉండాలి. చెక్క ప్లాట్‌ఫారమ్‌పై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఆ తర్వాత నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడ నుంచి గణేశుడి విగ్రహాన్ని తీసి సాంప్రదాయ పద్దతిలో నిమజ్జనం చేయాలి.

గణపతి విగ్రహ స్థాపన సమయంలో మనస్సును పూర్తిగా నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోండి. ఈ పండుగ సమయంలో ఇంట్లో స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని మాత్రమే తయారు చేయాలి. అన్ని రకాల తామసిక ఆహారాన్ని నిమజ్జనం వరకు తినొద్దు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గణపతి విగ్రహాన్ని పూజించండి. ఆహారం సమర్పించండి. వినాయక విగ్రహ ప్రతిష్టించిన తర్వాత ఆచారాల ప్రకారం గణేశుడిని పూజించండి. చివరిగా హారతి ఇవ్వండి. దీని తర్వాత గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు వంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. పూజ అనంతరం ఈ ప్రసాదం భక్తులకు పంపిణీ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు