Krishnashtami 2024: మనదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఈ దేశాల్లో కూడా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి.. లక్షలాది మంది విదేశీయులు కృష్ణభక్తులు..
ఇస్కాన్ ఆలయాన్ని 1966లో AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద ప్రారంభించారు. ప్రభుపాద స్వామివారు కోల్‌కతాలో జన్మించారు. శ్రీ కృష్ణుని పట్ల భక్తిని.. కృష్ణ అవతారం గురించి అవగాహన కలిగించడం ప్రారంభించినది ఆయనే. ఇస్కాన్ దేవాలయానికి భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే భారతదేశం వెలుపల చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జన్మాష్టమిని గొప్ప వైభవంగా జరుపుకుంటారు. నేడు ఇస్కాన్ టెంపుల్‌లోని చాలా మంది మోటివేషనల్ స్పీకర్‌లు ప్రజలకు భగవద్గీతను బోధించే వారిగా ప్రసిద్ధి చెందారు. కృష్ణుడి జీవిత తత్వాన్ని, ఆయన ఆలోచనలను ప్రజలకు తెలియజేయడమే ఈ ఆలయాన్ని నిర్మించడంలో ఉద్దేశం.
హిందూ మతంలో త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు సృష్టిని నియంత్రించే దైవంగా భావిస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వివిధ అవతారాలు ఎత్తిన శ్రీ మహా విష్ణువు 8వ అవతారంగా కృష్ణుడు పరిగణించబడుతున్నాడు. శ్రీ కృష్ణుడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శ్రీ కృష్ణునిపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం కృష్ణుని జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. కన్నయ్య పుట్టిన రోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ రోజును పండుగలా జరుపుకుంటారు. దేశంలోనూ, ప్రపంచంలోనూ కృష్ణుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే కృష్ణుడు ఆలయాలు అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఇస్కాన్ ఆలయం. ఇస్కాన్ ఆలయం కృష్ణుని ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఇది ప్రపంచవ్యాప్తంగా 650 కంటే ఎక్కువ దేవాలయాలను కలిగి ఉంది. భారతదేశంలో 400 కంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశం వెలుపల ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
ఇస్కాన్ దేవాలయం చరిత్ర
ఇస్కాన్ ఆలయాన్ని 1966లో AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద ప్రారంభించారు. ప్రభుపాద స్వామివారు కోల్‌కతాలో జన్మించారు. శ్రీ కృష్ణుని పట్ల భక్తిని.. కృష్ణ అవతారం గురించి అవగాహన కలిగించడం ప్రారంభించినది ఆయనే. ఇస్కాన్ దేవాలయానికి భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే భారతదేశం వెలుపల చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జన్మాష్టమిని గొప్ప వైభవంగా జరుపుకుంటారు. నేడు ఇస్కాన్ టెంపుల్‌లోని చాలా మంది మోటివేషనల్ స్పీకర్‌లు ప్రజలకు భగవద్గీతను బోధించే వారిగా ప్రసిద్ధి చెందారు. కృష్ణుడి జీవిత తత్వాన్ని, ఆయన ఆలోచనలను ప్రజలకు తెలియజేయడమే ఈ ఆలయాన్ని నిర్మించడంలో ఉద్దేశం.
విదేశాల్లో ఇస్కాన్ ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే..?
ఇస్కాన్ దేవాలయాలు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో ఉన్నాయి. భారతదేశంలో బృందావన్, ఢిల్లీ, నోయిడా, బెంగాల్, చెన్నై, ఘజియాబాద్, తిరుపతి, అహ్మదాబాద్ వంటి ప్రదేశాలలో ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు కృష్ణుడిని ఆరాధించడానికి వస్తారు. విదేశాల్లో ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
ఐరోపాలో 135 దేవాలయాలు ఉన్నాయి
ఐరోపా ఖండంలో ఇస్కాన్‌కు సంస్థకు సంబంధించి దాదాపు 135 దేవాలయాలు ఉన్నాయి. సాంస్కృతిక కేంద్రాలు కూడా ఇందులో ఉన్నాయి. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లో కృష్ణకు భారీ సంఖ్యలో భక్తులున్నారు. బెల్జియంలో కూడా శ్రీకృష్ణునికి సంబంధించి భారీ దేవాలయం ఉంది. అంతేకాదు రష్యాలో 30 కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. రష్యాకు చెందిన వారు, వైష్ణవ కమ్యూనిటీకి చెందిన వారు శ్రీకృష్ణుడిని ఆరాధించడానికి భారీ సంఖ్యలో ఈ ఆలయాలకు వస్తారు.
ఉత్తర, దక్షిణ అమెరికాలో కూడా ఇస్కాన్ ఆలయాలు
ఇస్కాన్ ఉత్తర అమెరికాలో 56 అనుబంధ దేవాలయాలను కలిగి ఉంది. ఇది కాకుండా ఆలయంతో అధికారికంగా అనుబంధించబడని అనేక ఇతర సంస్థలున్నాయి. అయితే ఇక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రోత్సహిస్తాయి. దక్షిణ అమెరికాలో కూడా 60 ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆరాధిస్తారు. మరోవైపు కెనడా గురించి మాట్లాడినట్లయితే చాలా మంది భారతీయులు ఇక్కడ నివసిస్తున్నారు. ఇస్కాన్‌కు సంబంధించిన 12 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి.
ఆఫ్రికాలో డిఫరెంట్ క్రేజ్
ఆఫ్రికన్ ఖండంలో కూడా కృష్ణుని తేజస్సు వెదజల్లుతూనే ఉంది. కృష్ణకు ఆఫ్రికాలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఆఫ్రికాలో ఇస్కాన్‌కు మొత్తం 69 అనుబంధ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో, డర్బన్ కేంద్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశం వెలుపల అతిపెద్ద రథయాత్ర కూడా డర్బన్‌లో జరుగుతుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
ఆసియా-ఆస్ట్రేలియాలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి?
భారతదేశం కాకుండా ఇస్కాన్ సంస్థ ఆసియాలో దాదాపు 80 కేంద్రాలను కలిగి ఉంది. ఈ కేంద్రాలు చాలా వరకు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ , మలేషియా వంటి దేశాల్లో ఉన్నాయి. ఇండోనేషియాలో హిందూమతం బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడ కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కృష్ణ చైతన్యానికి సంబంధించిన మొత్తం 6 ఆలయాలు ఉండగా, న్యూజిలాండ్‌లో 4 కేంద్రాలలో కృష్ణుడు పూజలందుకుంటున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు