Viral Video: యూనిఫామ్‌లో సినిమా పాటలకు పోలీసుల డ్యాన్సులు.. వేటు పడిందిగా..

పోలీసులు అంటే ఎప్పుడు కేసులతో బిజీగా ఉంటారు. కానీ వాళ్లు కూడా మనుషులేగా.. ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్‌లో యూనిఫామ్‌లో ఉండగా సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా వైరల్‌గా మారింది. అయితే అప్పుడు వాళ్లకు తెలీదు. ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నామని..

Viral Video: యూనిఫామ్‌లో సినిమా పాటలకు పోలీసుల డ్యాన్సులు.. వేటు పడిందిగా..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 23, 2024 | 1:05 PM

పోలీసులు అంటే ఎప్పుడు కేసులతో బిజీగా ఉంటారు. కానీ వాళ్లు కూడా మనుషులేగా.. ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్‌లో యూనిఫామ్‌లో ఉండగా సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా వైరల్‌గా మారింది. అయితే అప్పుడు వాళ్లకు తెలీదు. ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నామని మాత్రమే అనుకున్నారు. వాళ్లు చేసిన తప్పు ఏంటేంటే యూనిఫామ్‌లో ఉండి డ్యాన్స్ చేయడం. ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది. ఈ విషయం పై అధికారుల దృష్టికి చేరగా.. మూడు నెలల పాటు వీరిని సస్పెన్షన్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే… నాగ్‌పూర్‌లోని తహసీల్ పోలీస్ స్టేషన్ నుండి ASI సంజయ్ పాటంకర్, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖయ్యూమ్ గని, భాగ్యశ్రీ గిరి, కానిస్టేబుల్ నిర్మలా గావ్లీలను డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత అధికారులు ప్రముఖ బాలీవుడ్ పాట అయిన “ఖైకే పాన్ బనారస్వాలా” కి డ్యాన్స్ చేశారు. ఇదంతా సదరు పోలీసు సిబ్బంది వీడియో తీశారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అధికారులు సమర్థించగా.. మరికొందరు దుయ్యబట్టారు. ఇలా ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వీరిపై చర్యలు తీసుకున్నారు. డ్యాన్స్ చేసిన నలుగురిని సస్పెండ్ చేస్తూ.. జోన్-3 ఇన్‌ఛార్జ్ డీసీపీ రాహుల్ మద్నే ఆదేశించారు. యూనిఫామ్‌కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని.. పదే పదే డ్యాన్సులు చేస్తూ పోలీసుల పరువు తీయొద్దని వార్నింగ్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు