బ్యాంక్ లాకర్ లో నగదు, పత్రాలను తినేసిన చెదలు.. లబోదిబోమంటున్న కస్టమర్స్
లాకర్‌లో ఉంచిన వెంటనే తమ డబ్భులను చెదపురుగులు తినేశాయని ససారం యూకే బ్యాంకుకు చెందిన ఇద్దరు ఖాతాదారుల ఆరోపణ చేశారు. వీరిలో ఒకరిది నగదు కాగా.. మరొకరివి విలువైన పత్రాలు. లాకర్‌లోని చెదపురుగులు వీటిని మాయం చేశాయని ఆరోపిస్తున్నారు. లాకర్‌లో ఉంచిన వస్తువుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బ్రాంచ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాకర్ దగ్గర ఏర్పాటు చాలా అధ్వాన్నంగా ఉందని వినియోగదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లాకర్ లో ఉంచిన విలువైన వస్తువులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
బ్యాంక్ లాకర్ అంటే ఖరీదైన, విలువైన వస్తువులను అత్యంత భద్రంగా దాచుకునే ప్లేస్ అని కస్టమర్స్ భావిస్తారు. అందుకనే నోట్లు కావచ్చు, మరేదైనా ఆస్తికి సంబంధించిన పత్రాలు, బంగారు, వెండి వంటి ఖరీదైన వస్తువులను బ్యాంకు లాకర్‌లో భద్రంగా ఉంచుతారు. అయితే లాకర్ లోపల ఉంచిన నోట్లను చెదపురుగులు తినేయడం నిజంగా ఆశ్చర్యమైన విషయమే. బీహార్‌లోని ససారమ్‌లో ఓ వ్యక్తి కష్టపడి సంపాదించిన నగదును బ్యాంకు లాకర్‌లో దాచుకున్నాడు. అయితే లాకర్‌లో ఉంచిన వెంటనే తమ డబ్భులను చెదపురుగులు తినేశాయని ససారం యూకే బ్యాంకుకు చెందిన ఇద్దరు ఖాతాదారుల ఆరోపణ చేశారు. వీరిలో ఒకరిది నగదు కాగా.. మరొకరివి విలువైన పత్రాలు. లాకర్‌లోని చెదపురుగులు వీటిని మాయం చేశాయని ఆరోపిస్తున్నారు.
లాకర్‌లో ఉంచిన వస్తువుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బ్రాంచ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాకర్ దగ్గర ఏర్పాటు చాలా అధ్వాన్నంగా ఉందని వినియోగదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లాకర్ లో ఉంచిన విలువైన వస్తువులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
మొత్తం డబ్బును తినేసిన చెదలు
ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తన డబ్బును లాకర్‌లో ఉంచడం సురక్షితంగా భావించి తన సంపాదనలో 60 వేల రూపాయలను అక్కడే జమ చేశాడు. కొంత రోజున తర్వాత డిపాజిట్ చేసిన డబ్బును తీసుకునేందుకు లాకర్ వద్దకు చేరుకోగా.. ఆ లాకర్ లోని నోట్ల పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. నోట్లను చెదపురుగులు తినేశాయి. మరోవైపు డాక్టర్ ప్రమోద్ రాయ్ తన ముఖ్యమైన పత్రాలను కూడా లాకర్‌లో ఉంచారు. వాటిని కూడా చెదపురుగులు తినేశాయి.
బ్యాంకు నిర్లక్ష్యానికి వినియోగదారులిద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి ముఖ్యమైన పత్రాలు పాడైపోయాయి. దీని కారణంగా ఇప్పుడు తమ ఆస్తికి సంబంధించిన చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. కస్టమర్లు తమ నిత్యావసర వస్తువులను లాకర్‌లో ఉంచుతారని.. అవి భద్రంగా బ్యాంక్ లో ఉంటాయనే నమ్మకంతో ఉంటారని.. అయితే యూకే బ్యాంకు సిబ్బంది అజాగ్రత్త తారాస్థాయికి చేరిందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..