Shikari Devi Temple: పాండవులు నిర్మించిన ఈ ఆలయం.. పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ

ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ ఆలయంపై పైకప్పును నిర్మించే పనిని చాలాసార్లు ప్రారంభించినట్లు చెబుతారు. అయితే ఈ ఆలయ పైకప్పును నిర్మించే ప్రయత్నాలు ఎన్ని సార్లు చేసినా అవి ఎప్పుడూ విఫలమయ్యాయి. ఈ ఆలయ గోడలపై పైకప్పు ఎప్పుడూ నిలవలేదు. ఇక్కడ అమ్మవారు బహిరంగ పై కప్పు లేకుండా ఆకాశం క్రింద నివసించడానికి ఇష్టపడుతుందని భక్తుల నమ్మకం. గుడికి పైకప్పు వేసుకుని నివసించడం ఆమెకు ఇష్టం లేదని చెబుతారు.

Shikari Devi Temple: పాండవులు నిర్మించిన ఈ ఆలయం.. పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ
Mandi Shikari Devi Temple
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2024 | 3:12 PM

భారతదేశాన్ని దేవాలయాలకు ఆలయంగా, ఋషుల నివాసంగా పిలుస్తారు. అనేక రహస్యమైన, ప్రత్యేకమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటికీ తమదైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నేటికీ మిస్టరీగా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి ఒక ఆలయం దాని అద్భుతాలతో ప్రసిద్ధి చెందింది, అయితే దాని శాస్త్రీయ ఆధారం కూడా చాలా బలంగా పరిగణించబడుతుంది. పైకప్పు లేని ఈ ఆలయంలో మార్కండేయ మహర్షి ఒకప్పుడు తపస్సు చేశాడని చెబుతారు.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

దేవభూమి హిమాచల్‌లోని అనేక దేవాలయాలు ఇప్పటికీ అనేక రహస్యాలతో నిండి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేని రహస్యాలతో భక్తులను ఆకర్షిస్తున్నాయి. అటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం మండి జిల్లాలో కూడా ఉంది. జంజెహాలి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న షికారి దేవి ఆలయం అటువంటి దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం పైకప్పుని ఇప్పటికీ నిర్మించలేదు. మార్కండేయ మహర్షి ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడని ప్రతీతి. మహర్షి తపస్సుకు సంతోషించిన దుర్గదేవి.. శక్తి రూపంలో ఈ ప్రదేశంలో స్థిరపడింది.

ఇవి కూడా చదవండి

64 మంది యోగినిలు

పైకప్పు లేని ఈ ఆలయంలో 64 మంది యోగినిలు కలిసి కూర్చున్నారు. అందుకే షికారీ మాతను ‘యోగిని మాత’ అని కూడా అంటారు. నవదుర్గా దేవి, చాముండ, కమ్రునాగ మందిరం, పరశురాముని విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్టించబడ్డాయి.

ఆలయం పైకప్పు ఎప్పుడూ ఉండదు

ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ ఆలయంపై పైకప్పును నిర్మించే పనిని చాలాసార్లు ప్రారంభించినట్లు చెబుతారు. అయితే ఈ ఆలయ పైకప్పును నిర్మించే ప్రయత్నాలు ఎన్ని సార్లు చేసినా అవి ఎప్పుడూ విఫలమయ్యాయి. ఈ ఆలయ గోడలపై పైకప్పు ఎప్పుడూ నిలవలేదు. ఇక్కడ అమ్మవారు బహిరంగ పై కప్పు లేకుండా ఆకాశం క్రింద నివసించడానికి ఇష్టపడుతుందని భక్తుల నమ్మకం. గుడికి పైకప్పు వేసుకుని నివసించడం ఆమెకు ఇష్టం లేదని చెబుతారు.

మంచు గడ్డ కట్టని విగ్రహం

శీతాకాలంలో షికారి శిఖర కొండలపై అనేక అడుగుల హిమపాతం పేరుకుంటుంది. ఆలయ ప్రాంగణంలో అనేక అడుగుల వరకు మంచు కురుస్తుంది. అయితే ఆలయంపై పైకప్పు లేనప్పటికీ అమ్మవారి విగ్రహంపై మంచు అంటుకోవడం లేదా గడ్డకట్టడం ఇప్పటి వరకూ జరగలేదని చెబుతున్నారు.

పాండవులు తపస్సు చేసిన ప్రాంతం..

మార్కండేయ ఋషి తరువాత, తమ వనవాస సమయంలో పాండవులు కూడా ఇక్కడ తపస్సు చేశారు. పాండవుల తపస్సుకు సంతోషించిన దుర్గామాత ప్రత్యక్షమై పాండవులను యుద్ధంలో విజయం సాధిస్తారని అనుగ్రహించింది. అప్పుడే పాండవులు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొన్ని కారణాల వల్ల ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు అయితే వనవాసం చేస్తూ మరొక ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు పాండవులు. అలా ఆగిన ఆలయ నిర్మాణం నేటికీ పూర్తీ అవ్వలేదని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు