Shikhar Dhawan: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్.. ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్

శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ప్రకటించిన వీడియోను పంచుకున్నాడు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌కి, టీమిండియాకు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన 38 ఏళ్ల శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్ 10 డిసెంబర్ 2022న బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో ఆడాడు.

Shikhar Dhawan: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్.. ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్
Shikhar Dhawan
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2024 | 8:30 AM

ప్రముఖ భారతీయ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు తన అధికారిక సోషల్ మీడియా పేజీ ద్వారా తెలియజేశాడు. ఆగస్ట్ 24, శనివారం ఉదయం శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ప్రకటించిన వీడియోను పంచుకున్నాడు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌కి, టీమిండియాకు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన 38 ఏళ్ల శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్ 10 డిసెంబర్ 2022న బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2022 నుండి టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. యువకులు భారత క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టి సత్తా చూపుతూ ఉండడంతో శిఖర్ తిరిగి భారత జట్టులోకి రావడంలో విఫలమయ్యాడు.

క్రికెట్ ప్రయాణంలో తన ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నానని.. తాను లెక్కలేనన్ని జ్ఞాపకాలను, కృతజ్ఞతా భావాన్ని తన వెంట తీసుకువెళుతున్నానని పేర్కొన్నాడు. అంతేకాదు తనపై అభిమానులు చూపించిన ప్రేమకు అడుగడుగునా మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు! జై హింద్ అంటూ శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

దేశవాళీ క్రికెట్‌లో ఏళ్ల తరబడి కష్టపడి ధావన్ 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అయితే అప్పుడు డకౌట్‌గా నిష్క్రమించాడు. అతను 2011లో వైట్-బాల్ క్రికెట్‌లో తిరిగి వచ్చాడు కానీ ఆ జర్నీ కూడా స్వల్పకాలమే సాగింది. తిరిగి 2013లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ధావన్ తన సత్తా చాటాడు. శిఖర్ చిరస్మరణీయమైన ప్రదర్శన చేసి కేవలం 174 బంతుల్లో 187 పరుగులు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ పోటీల్లో ODI జట్టులో మరొకసారి పునరాగమనం చేసి బ్యాట్ తో తన సత్తా చాటి భారతీయ జట్టుకు ఎన్నో విలువైన పరుగులు జోడించాడు. తర్వాత మళ్ళీ శిఖర్ ధావన్ వెనుదిరిగి చూసుకోలేదు.

మరిన్ని క్రికట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..