Shakib Al Hasan: మళ్లీ చిక్కుల్లో పడిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్.. ఈసారి మర్డర్ కేసులో ..
షకీబ్ ప్రస్తుతం రావల్పిండిలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో అతను 27 ఓవర్లలో 109 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ స్టేషన్‌లో షకీబ్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన వ్యక్తి పేరు రఫీకుల్ ఇస్లాం, అతను ఢాకాలో జరిగిన నిరసనలో మరణించిన వ్యక్తి తండ్రి. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకుడిగా ఉన్నాడు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అతనిపై ఓ హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మొత్తం 500 మంది నిందితులుగా ఉన్నారు. షకీబ్ ప్రస్తుతం రావల్పిండిలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో అతను 27 ఓవర్లలో 109 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ స్టేషన్‌లో షకీబ్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన వ్యక్తి పేరు రఫీకుల్ ఇస్లాం, అతను ఢాకాలో జరిగిన నిరసనలో మరణించిన వ్యక్తి తండ్రి. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకుడు, అది షేక్ హసీనా పార్టీ. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే షేక్ హసీనాతో సన్నిహితంగా ఉన్నందుకే షకీబ్ అల్ హసన్ పై ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది..
షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫ్ మొర్తజా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఆందోళన కారులు అతని ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ఇప్పుడు షకీబ్ అల్ హసన్‌పై అలాంటి కేసు నమోదైంది. ఇది భవిష్యత్తులో ఈ ఆటగాడికి విపత్తుగా మారుతుంది. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాడా? రాడా? అన్నది సందేహాస్పదంగా మారింది. బంగ్లాదేశ్ లో షకీబ్ నివాసం ఖుల్నాలో ఉంది. అయితే ప్రస్తుతం అతని భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తుంటే ఈ ఆటగాడు పాకిస్థాన్ నుంచి నేరుగా అమెరికా వెళ్లనున్నాడని తెలుస్తోంది.
ఆందోళనలో క్రికెటర్ల కుటుంబాలు..
🚨🚨🚨 BREAKING: A case of murder has been filed against former member of parliament (BAL) and Bangladesh National Team cricketer Shakib Al Hasan. The case was filed at Adabar police station on 22nd August night.
Shakib is currently in Rawalpindi, playing a test vs. Pakistan. pic.twitter.com/Oou9wWzbSs
— Premiumerza 🇧🇩🇦🇷 (@PREMIUMERZA) August 22, 2024
షేక్ హసీనాకు మద్దతు ఇచ్చినందుకే..
A murder case has been registered against renowned Bangladeshi cricketer and former Awami League Member of Parliament, Shakib Al Hasan, in Dhaka. Shakib Al Hasan is accused of the murder of a government factory employee, the local Bangladeshi media pic.twitter.com/guiuLbqTca
— Tamimi (@TahawarTamimi) August 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..