AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shikhar Dhawan Net Worth: భారతదేశంలో అత్యంత ధనిక క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు, గబ్బర్‌కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..!

క్రికెట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఈ గేమ్‌లో మంచి ప్రదర్శన చేస్తే చాలు ఆ క్రికెటర్లు మంచి ఆదాయాన్ని పొందుతారు. డబ్బుల సంపాదన విషయంలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. కోహ్లితో పాటు MS ధోని, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి చాలా మంది గొప్ప క్రికెటర్లు ఈ భారత ధనిక ఆటగాళ్ల జాబితాలో చేర్చబడ్డారు. అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా శిఖర్ ధావన్ టీమ్ ఇండియాలో భాగం కాలేదు. అయినప్పటికీ శిఖర్ ధావన్ పేరు అత్యంత ధనిక భారతీయ క్రికెటర్లలో చేర్చబడింది.

Shikhar Dhawan Net Worth: భారతదేశంలో అత్యంత ధనిక క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు, గబ్బర్‌కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..!
Shikhar Dhawan Net Worth
Surya Kala
|

Updated on: Aug 24, 2024 | 12:09 PM

Share

భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఆగస్టు 24 శనివారం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో గబ్బర్ 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. ఈ 14 ఏళ్లలో ధావన్ భారత్ తరఫున అద్భుతంగా రాణించడంతో పాటు భారీగా డబ్బు సంపాదించాడు. టీమ్ ఇండియా నుంచి వచ్చే జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర మార్గాలు అతనికి డబ్బులు సంపాదించుకునే ఆదాయ వనరులు. వీటి ఆధారంగా శిఖర్ ధావన్ టీమ్ ఇండియాలోని ధనవంతులైన ఆటగాళ్లలో ఒకరుగా లెక్కించబడ్డాడు. భారత జట్టులో గబ్బర్‌గా పేరుగాంచిన శిఖర్ ధావన్‌కు ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ధావన్‌కి కోట్ల ఆస్తులున్నాయి

క్రికెట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఈ గేమ్‌లో మంచి ప్రదర్శన చేస్తే చాలు ఆ క్రికెటర్లు మంచి ఆదాయాన్ని పొందుతారు. డబ్బుల సంపాదన విషయంలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. కోహ్లితో పాటు MS ధోని, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి చాలా మంది గొప్ప క్రికెటర్లు ఈ భారత ధనిక ఆటగాళ్ల జాబితాలో చేర్చబడ్డారు. అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా శిఖర్ ధావన్ టీమ్ ఇండియాలో భాగం కాలేదు. అయినప్పటికీ శిఖర్ ధావన్ పేరు అత్యంత ధనిక భారతీయ క్రికెటర్లలో చేర్చబడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గౌతమ్ గంభీర్ 2024లో $19 మిలియన్ల నికర విలువతో భారతదేశంలోని టాప్-10 సంపన్న క్రికెటర్లలో 10వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే శిఖర్ ధావన్ మొత్తం సంపద దాదాపు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 142 కోట్లు). దీన్ని బట్టి ధావన్ ఆదాయం ఎవరికీ తక్కువ కాదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో అత్యధికంగా డబ్బు సంపాదించిన గబ్బర్

శిఖర్ ధావన్ జియో, నెరోలాక్ పెయింట్స్, జిఎస్ కాల్టెక్స్, లేస్, ఒప్పో, బోట్ వంటి అనేక పెద్ద కంపెనీల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను చేశాడు. BCCI జీతం కూడా అతని సంపాదనలో ఒక ముఖ్యమైన భాగం, అయితే శిఖర్ IPL ద్వారా కూడా తన కెరీర్‌లో అత్యధిక డబ్బు సంపాదించాడు. శిఖర్ ధావన్ 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడటం ప్రారంభించాడు. ఈ సీజన్‌లో అతడిని ఢిల్లీ జట్టు రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది. మొత్తం ఐపిఎల్ 16 సీజన్లలో శిఖర్ ధావన్ మొత్తం 91.8 కోట్ల రూపాయలు సంపాదించాడు.

లగ్జరీ కార్లు కలెక్షన్

శిఖర్ ధావన్‌కి కార్లు, బైక్‌లంటే చాలా ఇష్టం. అతని వద్ద లగ్జరీ కార్లకు సంబందించిన మంచి కలెక్షన్ ఉంది. నివేదిక ప్రకారం గబ్బర్ వద్ద మెర్సిడెస్ GL350 CDI, ఆడి కార్లు ఉన్నాయి. ఇవే కాదు గబ్బర్ వద్ద హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్, సుజుకి హయబుసా, కవాసకి నింజా ZX-14R వంటి అనేక ఖరీదైన బైక్‌లను కూడా సేకరించాడు.

మరిన్ని క్రికట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..