Viral Video: టెర్మినేషన్ లెటర్‌ చూసి స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగి.. వీడియోను చూసి భావోద్వేగానికి గురైన ప్రజలు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రసిద్ధ మోనాల్ రెస్టారెంట్ మూసివేసిన వార్త చాలా మందిని ప్రభావితం చేసింది, ముఖ్యంగా అప్పటి వరకూ ఉద్యోగులు.. ఆకస్మాత్తుగా నిరుద్యోగులుగా మారిపోయారు. ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో మోనాల్ రెస్టారెంట్ కూడా ఒకటి.

Viral Video: టెర్మినేషన్ లెటర్‌ చూసి స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగి.. వీడియోను చూసి భావోద్వేగానికి గురైన ప్రజలు
Restaurant EmployeeImage Credit source: Instagram/@islamabadbeautyofpakistan
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2024 | 11:49 AM

ఒక సంస్థ హటాత్తుగా మూతబడితే చాలా మంది జీవితంపై దాని ప్రభావం పడుతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పొతే అప్పుడు ఆ వ్యక్తీ పడే వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇందుకు సంబంధించిన ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రసిద్ధ మోనాల్ రెస్టారెంట్ మూసివేసిన వార్త చాలా మందిని ప్రభావితం చేసింది, ముఖ్యంగా అప్పటి వరకూ ఉద్యోగులు.. ఆకస్మాత్తుగా నిరుద్యోగులుగా మారిపోయారు. ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో మోనాల్ రెస్టారెంట్ కూడా ఒకటి.

సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత మోనల్ రెస్టారెంట్ సెప్టెంబర్ 11, 2024 నుండి తన కార్యకలాపాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఉద్యోగులపై అత్యంత తీవ్ర ప్రభావం చూపింది. అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి ఒక్కసారిగా నిరుద్యోగులుగా 700 మంది ఉద్యోగులు మారారు. తమ ఉద్యోగం కోల్పోయిన మోనాల్ ఉద్యోగులు ఏడుస్తున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మోనాల్ రెస్టారెంట్ ఉద్యోగికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగింసినట్లు ఉన్న లెటర్ చదువుతూ స్పృహతప్పి పడిపోయాడు. ఇక నుంచి తన కుటుంబాన్ని ఎలా పోషించాలి అంటూ బోరున విలపించాడు. ఈ వీడియో ప్రజల హృదయాలను తాకింది. ఈ సంఘటన ఈ ఉద్యోగుల కష్టాలపై ప్రజలను ఆవేదనకు గురిచేసింది.

ఇక్కడ వీడియో చూడండి

మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ తన ఉద్యోగులకు వీడ్కోలు లేఖ రాశాడు. అందులో అతను ఉద్యోగుల నిరుద్యోగంపై విచారం వ్యక్తం చేశాడు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే విధంగా తన ఉద్యోగస్తులకు ప్రేరణ ఇచ్చాడు. రెస్టారెంట్ మూసివేత సంఘటన సోషల్ మీడియాలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. బాధిత ఉద్యోగులకు ప్రజలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారికి మంచి అవకాశాలు కావాలని ఆకాంక్షించారు.

ఒకదారు వ్యాఖ్యానించారు అతను అతిగా స్పందించడం లేదు. ఉద్యోగం పోగొట్టుకున్న బాధ వారికీ మాత్రమే తెలుస్తుంది. మరికొందరు పిల్లలకు ఎలా భోజనం పెట్టాలి.. ఎలా కుటుంబాన్ని పోషించాలి.. అసలు ఎలా బతకాలి అంటూ ఏడుస్తున్నాడని అంటున్నారు. మరొకరు అతనికి త్వరలో మరో ఉద్యోగం రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..