Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 31, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారముంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 31st August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 31, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 31, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారముంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొందరు బంధువులతో రాజీమార్గంలో వివాదాలను పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. కొత్త ఉద్యోగం విషయంలో మిత్రుల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో బాగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారముంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. బంధువర్గంతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా, సంతృ ప్తికరంగా ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యం బాధిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ధనపరంగా మంచి స్థితిలో ఉంటారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగ కపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలోఅదనపు బాధ్యతలు చికాకు పెడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. అవసరానికి కొందరు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవ హారాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదం విషయంలో సోదరుల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. పట్టుదలగా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయ వృద్ధి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఊహించని విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తి వివా దాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రులకు వీలైనంతగా సహాయం చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల మీద అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. చేపట్టిన పనుల్లో కొద్దిగా వ్యయ ప్రయాసలుంటాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రావలసిన సొమ్ము సకాలంలో అందకపోవచ్చు. గతంలో మీ సహాయం పొందినవారు కూడా ముఖం చాటేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మాన సిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ మంచి ఫలితా లనిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితికి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొద్దిపాటి ఆస్తి కొనే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభ వార్త వినే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలను అమలు చేస్తారు. రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులన్నిటిలో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తి వివాదాల్లో రాజీమార్గం అనుసరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహ రించడం మంచిది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా, నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో కొన్ని పొరపాట్టు జరిగే అవకాశం ఉంది. వీలైనంతగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశ మనం లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగి పోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ధనపరంగా ఎవరికీ ఎలాంటి వాగ్దానాలూ చేయవద్దు.