Vinayaka Chavithi: ఈ గుహలో అన్నీ రహస్యాలే.. నేటికీ వినాయకుడి తలకు పూజలు, అభిషేకం

అయితే శివుడు తనని పార్వతి దేవి వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న బాలుడి తలను త్రిశూలంతో ఖండించగా బాలుడికి ఏనుగు తల అతికించి ప్రాణం పోశారు. అయితే పురాణాల కథల ఆధారంగా వినాయకుడి కత్తిరించిన తల నేటికీ ఉంది. కోపంతో మహాదేవుడు గణేశుడి తలను మొండెం నుంచి చేశాడు. మహాదేవుడు చేసిన పనికి పార్వతీదేవి చాలా బాధపడింది. అప్పుడు తన కొడుకును ఏనుగు తలని అతికించి జీవం పోశాడు.

Vinayaka Chavithi: ఈ గుహలో అన్నీ రహస్యాలే.. నేటికీ వినాయకుడి తలకు పూజలు, అభిషేకం
Patal Bhuvaneshwar Cave
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2024 | 7:09 PM

హిందువులు పూజించే ప్రధాన దీవుల్లో ఒకరు గణపతి. విఘ్నలు కలగనివ్వ వద్దంటూ మొదటి పూజను చేస్తారు. హిందూ పంచాంగం ప్రకారం భాద్ర మాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయకుడి జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ప్రతి ఇంట్లో వినాయకుడు ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతాయి. అయితే వినాయకుడి జనానికి సంబంధించిన అనేక పురాణ కథలున్నాయి. శివపార్వతుల ముద్దుల తనయుడు గజాననుడు తనని కోరి కొలిచిన భక్తుల కోర్కెలు తీరుస్తాడని నమ్మకం.

అయితే శివుడు తనని పార్వతి దేవి వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న బాలుడి తలను త్రిశూలంతో ఖండించగా బాలుడికి ఏనుగు తల అతికించి ప్రాణం పోశారు. అయితే పురాణాల కథల ఆధారంగా వినాయకుడి కత్తిరించిన తల నేటికీ ఉంది. కోపంతో మహాదేవుడు గణేశుడి తలను మొండెం నుంచి చేశాడు. మహాదేవుడు చేసిన పనికి పార్వతీదేవి చాలా బాధపడింది. అప్పుడు తన కొడుకును ఏనుగు తలని అతికించి జీవం పోశాడు. అయితే అప్పుడు తెగి పడిన వినాయకుడి ఓ గుహలో భద్రంగా ఉంది. ఆ గుహ నేటికీ ఉంది. కోల్‌కతా సమీపంలో ఉన్న ఆ గుహలో నేటికీ తెగిన వినాయకుడి శిరస్సును సందర్శించవచ్చు. ఇక్కడ గణేశ పూజగా ఈ మస్తకానికి అభిషేకం చేస్తారు.

ఆ రహస్య గుహ ఎక్కడ ఉంది?

గణేశుడి తల ఉన్న గుహ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో ఉంది. ఈ గుహను పాతాళ భువనేశ్వరాగా పిలుస్తారు. ఈ గుహ ఓ పర్వతం మీద దాదాపు 90 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుహలో వినాయకుడు ఆదిగణేషుడు గా పూజలను అందుకుంటున్నారు. ఈ గుహను క్రీ.శ.1941లో ఆదిశంకరాచార్యులు కనుగొన్నారు. ఈగుహ గురించి స్కాందపురాణంలోని మానస విభాగంలో ప్రస్తావించబడింది.

ఇవి కూడా చదవండి

కలియుగ అంతానికి చిహ్నం

పాతాళ భువనేశ్వర గుహలో నాలుగు యుగాలకు ప్రతీకగా మొత్తం నాలుగు రాతి కట్టలు ఉన్నాయి. వాటిలో ఒక స్థంభం క్రమంగా పైకి లేస్తుంది. ఈ స్థంభం కలియుగ చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ స్థంభం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఎప్పుడైతే ఈ స్థంభం గుహ గోడను తాకుతుందో ఆ రోజు కలియుగం అంతం అవుతుందని విశ్వాసం.

సకల దేవతల నివాసం ఈ గుహ

అయితే ఈ పాతాళ భువనేశ్వర గుహ గురించి చాలా మందికి తెలియదు. ఈ రహస్య గుహలో వినాయకుడు తల మాత్రమే కాదు శివునితో సహా సకల దేవతలు నివసిస్తున్నారని నమ్మకం. అందు సాక్ష్యంగా ఈ గుహలో బద్రీనాథ్, కేదార్నాథ్ , అమర్నాథ్ కూడా కనిపిస్తాయి. బద్రీనాథ్‌లో యమ కుబేరుడు, వరుణుడు, లక్ష్మి, గరుత్మంతుడు, గణేశుడు వంటి రాతి శిల్పాలు ఉన్నాయి.

కొండల నుండి నీటి చుక్కలు

పాతాళ భువనేశ్వర గుహలో కాల భైరవుని నాలుక కూడా కనిపిస్తుంది. కాల భైరవుడు తన నోటి నుంచి గర్భంలోకి ప్రవేసించి చివరికి చేరుకున్నవారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు ఈ గుహలో గణేశుడి రాతి విగ్రహం 108 బ్రహ్మకమలాల మధ్య ఉంది. ఈ బ్రహ్మకమలం నుండి నీరు నీటి బిందువుల రూపంలో వినాయకుని తలపై పడుతుంది. చుక్క చుక్క నీరు వినాయకుడు తలపై పడడం కనిపిస్తూనే ఉంటుంది.

ఎవరు కనుగొన్నారు?

గుహలో ఉన్న బ్రహ్మకమలాన్ని శివుడు స్థాపించాడని నమ్ముతారు. త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశ రాజు ఋతుపర్ణ ఈ గుహను కనుగొన్నాడని చెబుతారు. పురాణాల ప్రకారం ఒక రోజు ఋతుపర్ణ అడవి జింకను వెంబడిస్తూ ఈ గుహ ముందుకు చేరుకున్నాడు. అప్పుడు రాజు కుతూహలంతో గుహలోకి చూడగా సకల దేవతలతో కొలువైన శివయ్యను దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?