Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగంలో ఇబ్బందులు.. అధికంగా ఒత్తిళ్లు..!

Horoscope Today (October 09-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు..

Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగంలో ఇబ్బందులు.. అధికంగా ఒత్తిళ్లు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 09, 2021 | 6:33 AM

Horoscope Today (October 09-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 9న ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి:

పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి:

ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వృత్తిపరంగా ఒత్తిడి ఎదుర్కొవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి.

మిథున రాశి:

ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయట పడతారు. ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. బంధు, మిత్రుల సహాయ సహకరాలు తీసుకోవడం మంచిది.

కర్కాటక రాశి:

ముఖ్యమైన పనులపై శ్రద్ద వహించాలి. ఆర్థికంగా మెరుగు పడతారు. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వ్యాపారంలో ముందుకు సాగుతారు. పని ఒత్తిడి ఉంటుంది.

సింహ రాశి:

చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య రాశి:

ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

తుల రాశి:

చేపట్టిన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.

వృశ్చిక రాశి:

ఆర్థిక ఇబ్బందులు మెరుగు పడతాయి. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి:

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఏ్పడతాయి. నమ్మించి మోసగించే వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహాయసహకారాలు అందుతాయి.

మకర రాశి:

ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి:

ధైర్యంతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. దృష్టులకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులు అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది.

మీన రాశి:

శుభవార్తలు వింటారు. ఆశించినంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.

ఇవీ కూడా చదవండి:

Brahmotsavas: చిన్నశేష వాహ‌నంపై మ‌ల‌య‌ప్పస్వామి.. దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సు లభిస్తుందని నమ్మకం

Goddess Vakula: ఆనంద నిలయంలో మూలవిరాట్టు వక్షస్థలంపై స్వర్ణలక్ష్మిని ఎవరు ప్రతిష్టించారు.. ఏమా అద్భుతం.?