Surya Kala |
Updated on: Oct 08, 2021 | 8:39 PM
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవి ధరించి గీతా కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
చిన్నశేష వాహనంపై గీతా కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి.. నాగలోకానికి రాజుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నమూనా బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగులు నిలుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు ఇతర అధికారులు పాల్గొన్నారు.