Goddess Vakula: ఆనంద నిలయంలో మూలవిరాట్టు వక్షస్థలంపై స్వర్ణలక్ష్మిని ఎవరు ప్రతిష్టించారు.. ఏమా అద్భుతం.?

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Oct 08, 2021 | 8:39 PM

Goddess Vakula: వ్యూహాలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ ఆయురారోగ్యాలు.. సకల సౌభాగ్యాలు.. అష్టైశ్వర్యాలు కలుగుతాయంటున్నారు పండితులు!

Goddess Vakula: ఆనంద నిలయంలో మూలవిరాట్టు వక్షస్థలంపై స్వర్ణలక్ష్మిని ఎవరు ప్రతిష్టించారు.. ఏమా అద్భుతం.?
Vakula Maha Lakshmi

Follow us on

Vakula Lakshmi: ఆనంద నిలయంలో మూలవిరాట్టు వక్షస్థలంపై ప్రతిష్టించిన మహాలక్ష్మి ఎవరు ? శ్రీవారి వక్షస్థలంపై స్వర్ణలక్ష్మిని ఎవరు ప్రతిష్టించారు ? శుక్రవారంనాడు గోవిందునికి అభిషేకం ఎందుకు నిర్వహిస్తారు ? అసలు వైకుంఠనాధుడ్ని శ్రీనివాసుడుగా ఎందుకు పిలుస్తారు ? ప్రపంచంలో ఏ ఇతర దేవాలయాలకు లేని..జన, ధన ఆకర్షణ.. తిరుమలలోనే ఉండటానికి కారణమేమిటి? శ్రీనివాసుడి వక్షస్థలంపై ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారి గురించి ప్రపంచానికి తెలియని విశేషాలు ఇప్పుడు చూద్దాం!!

తిరుమల ఆనంద నిలయంలోని మూల విరాట్టు వక్ష స్థలంపై శ్రీ మహాలక్ష్మి ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వేంకటనాథుడిని శ్రీనివాసుడుగా పిలుస్తారు. ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు! ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని తంత్ర శాస్త్ర విశేషమైన కార్యక్రమం.

ఒకానొక సందర్భంలో స్వామి వారు ఎవరు? అనే ధర్మసందేహం ఉన్న రోజుల్లో భగవత్ రామానుజుల వారు.. ఈ స్వామి సాక్షాత్తు వైకుంటనాథుడని..వైకుంఠం నుంచి భూలోకంలో అచ్ఛావతార మూర్తిగా అవతరించారని ప్రపంచానికి చాటారు. అంతేకాదు, స్వామి వారికి శంఖు చక్రాలను ఏర్పాటు చేసి.. పచ్చ కర్పూరంతో నామంపెట్టి.. వక్షస్థలంపై వ్యూహాలక్ష్మి అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించారని పెద్దలు చెబుతారు.

శ్రీవారి వక్షస్థలంపై మహాలక్ష్మి ఉండటం వల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణుడికి అభిషేకం నిర్వహించే సంప్రదాయాన్ని రామనుజులవారే ఆరంభిచారని తిరుమల శాసనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా జియాంగార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, శ్రీవారి కైంకర్యాల కోసం తొలి జీయర్ మఠాన్ని కూడా అప్పుడే స్థాపించారని పేర్కొంటున్నాయి. ఈ సంప్రదాయం నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అలా శ్రీవారి వక్ష స్థలంపై వ్యూహాలక్ష్మి ఉండటం వల్లే స్వామివారికి జన, ధన ఆకర్షణ విశేషంగా ఉంటుందంటారు పండితులు!

ప్రతి శుక్రవారం వ్యూహలక్ష్మి అమ్మవారికి హరిద్రోదకంతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు. స్వామి వారికి కూడా అభిషేకం తర్వాత పచ్చ కర్పూరం అలంకరిస్తారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించిన తరువాత.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ వ్యూహ లక్ష్మిని దర్శించుకొనే భక్తులకు కోరినన్ని కోరికలు తీరుతాయని విశ్వాసం.

ఈ వ్యూహాలక్ష్మినే స్వర్ణ లక్ష్మిగా పూజిస్తారు. మహాలక్ష్మి అమ్మవారు మాంగళ్యంతో మనకు దర్శనమిస్తారు. ఈ ప్రతిమను కూడా ప్రతి శుక్రవారం శ్రీసూక్త యుక్తంగా సుగంధ ద్రవ్యంతో, చందనంతో అభిషేకం జరిపి.. నూతన వస్త్రాలను సమర్పించి.. మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూర హారతి ఇస్తారు. ఇలా పూజాలందుకుంటున్న వ్యూహాలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ ఆయురారోగ్యాలు.. సకల సౌభాగ్యాలు.. అష్టైశ్వర్యాలు కలుగుతాయంటున్నారు పండితులు!

Read also: Telangana TMC: యువర్ అటెన్షన్ ప్లీజ్..! తెలంగాణ పొలిటికల్ పట్టాలపైకి దీదీ ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu