Amavasya 2024: అమావాస్యతో వారికి సరికొత్త జీవితం..! ఈ రాశులకు పట్టందల్లా బంగారమే

Amavasya 2024 Horoscope: నవంబర్ 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో వస్తున్న అమావాస్య మిగిలిన అమావాస్యల మాదిరిగా కాకుండా, ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వృశ్చిక రాశి చంద్రుడికి నీచ రాశి. అయితే, ఈ రాశిలో రవి, చంద్రులు కలవడంతో పాటు, వాటితో బుధుడు కూడా కలవడం, పైగా గురువు పూర్ణ దృష్టితో ఈ రవి చంద్రుల కలయిక (అమావాస్య)ను చూడడం వల్ల ఇక్కడి చంద్రుడికి పౌర్ణమి నాటి పూర్ణ చంద్రుడి బలం కలిగింది. దీనివల్ల కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్తి వివరాల తెలుసుకోండి.

Amavasya 2024: అమావాస్యతో వారికి సరికొత్త జీవితం..! ఈ రాశులకు పట్టందల్లా బంగారమే
Amavasya November 2024 Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 30, 2024 | 6:01 PM

New Moon Astrology: ఈ నెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో వస్తున్న అమావాస్య మిగిలిన అమావాస్యల మాదిరిగా కాకుండా, ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం జరగబోతోంది. వృశ్చిక రాశి చంద్రుడికి నీచ రాశి. అయితే, ఈ రాశిలో రవి, చంద్రులు కలవడంతో పాటు, వాటితో బుధుడు కూడా కలవడం, పైగా గురువు పూర్ణ దృష్టితో ఈ రవి చంద్రుల కలయిక (అమావాస్య)ను చూడడం వల్ల ఇక్కడి చంద్రుడికి పౌర్ణమి నాటి పూర్ణ చంద్రుడి బలం కలిగింది. దీనివల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు పట్టిందల్లా బంగారం అవుతుంది.

  1. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఏర్పడిన రవి, చంద్రుల యుతిని గురువు వీక్షిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఈ మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా, ఇతర ప్రయత్నాలద్వారా కూడా ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  2. కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడిని లాభ స్థానం నుంచి గురువు వీక్షిస్తున్నందువల్ల చంద్రుడికి నీచభంగం కలగడంతో పాటు, గజకేసరి యోగం కూడా ఏర్పడడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ శక్తిసామర్థ్యాలకు సరైన గుర్తింపు లభించి ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజి కంగా గౌరవాబిమానాలు వృద్ధి చెందుతాయి. లాభదాయక స్నేహ సంబంధాలు ఏర్పడతాయి.
  3. తుల: ఈ రాశికి రెండవ స్థానంలో చోటు చేసుకుంటున్న అమావాస్య వల్ల ఉద్యోగపరంగా ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలను చేపడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశ మనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశిలో రవి, చంద్రులు కలవడం ఒక యోగం కాగా, గురుడితో సమ సప్తకం దృష్టివల్ల గజకేసరి యోగం ఏర్పడడం మరో విశేషం. ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరు గుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మంచి గుర్తింపు లభించి, గౌరవ మర్యాదలు పెరుగు తాయి.
  5. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఏర్పడిన రవి చంద్రుల కలయికను పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం కావడంతో పాటు జీతభత్యాలు, ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆదాయ మార్గాలు విస్తరించే సూచనలు న్నాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు.
  6. మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో అమావాస్య ఏర్పడడంతో పాటు, దాన్ని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బంతా అప్రయత్నంగా చేతికి అందుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందనలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు తేలికగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి.