Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7, 2024 వరకు): మేష రాశి వారికి ఆదాయపరంగా వారమంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి పనిభారం పెరగడంతో పాటు, అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి. మిథున రాశి వారి ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 01, 2024 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయపరంగా వారమంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సానుకూలపడతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధు మిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. పనిభారం పెరగడంతో పాటు, అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి. అయితే, ఉద్యోగంలో మీ ప్రతిభకు,  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉన్నా లాభాలకు కొదవ ఉండదు. కొద్ది కష్టంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగులకు అనుకోకుండా ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమ స్యలు పరిష్కారమవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.  రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యో గులకు ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారడం జరుగు తుంది. అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండక పోవచ్చు. ఆర్థిక వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ముఖ్యమైన ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగి పోతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలలో బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో కొత్త బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్త  వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబం ధించి మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. సాధారణంగా ఏ పని తలపెట్టినా సాను కూల ఫలితాలనిస్తుంది. వ్యక్తిగత సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో పురోగమిస్తుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. అధికారులు మీకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం అనేక మార్గాల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గృహ, వాహన ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. చిన్న నాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించవచ్చు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, విలాసాల మీద ఖర్చు పెరిగి ఇబ్బంది పడతారు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిత్రార్జితం లభించే అవ కాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందు తాయి. వ్యాపా రాలు బాగా లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకా లంలో పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదాయ పరిస్థితులు అను కూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వివాదాల్లో తల దూర్చి భంగపడతారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక విష యాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీత భత్యాలు, ప్రమోషన్ల విషయంలో శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. బంధువులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల సహాయంతో ఆశిం చిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగాల్లో బాధ్యతలు, హోదాలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలను మించి అభివృద్ది చెందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరిగి, విశ్రాంతి కరువవుతుంది. వృత్తిపరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత, వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల రాకతో ఇంట్లో సందడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.  అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఇతరు లకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది.  కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి.  ఆరో గ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

12 / 12
Follow us
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.

ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని

కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..

భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్

నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్

కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..

అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా

బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..

2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు..