- Telugu News Photo Gallery Spiritual photos Guru and Shukra Planet impact these zodiac signs to have adhaya and adhikara yogas telugu astrology
Zodiac Signs: గురు, శుక్రుల ప్రభావం.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు..!
Telugu Astrology: డిసెంబర్ 3వ తేదీన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడంతో గురువు దృష్టి శుక్రుడి మీద పడుతుంది. శుక్రుడిని గురువు చూడడం వల్ల సునాయాసంగా, అప్రయత్నంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. శుక్రుడి మీద గురువు దృష్టి యోగదాయకమని, అనేక కోరికలు, ఆశలు నెరవేరుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శుక్రుడు మకర రాశిలో ఈ నెల 28 వరకూ కొనసాగుతాడు. అంత వరకూ మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులకు తప్పకుండా కొన్ని శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది.
Updated on: Dec 01, 2024 | 6:23 PM

మేషం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద గురు దృష్టి పడినందువల్ల ఉద్యోగంలో తప్ప కుండా అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. సమాజంలో రాచ మర్యాదలు పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు, అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

వృషభం: భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడి మీద గురు దృష్టి పడడం వల్ల అనేక శుభ యోగాలు కలుగుతాయి. సుమారు నెల రోజుల పాటు జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు బాగా వృద్ది చెందుతాయి. వ్యాపారాలు అభివృద్ది బాట పడతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద గురువు దృష్టి పడినందువల్ల తప్పకుండా బాగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కు తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యో గంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం: ఈ రాశిలో ఉన్న శుక్రుడి మీద పంచమ స్థానంలో ఉన్న గురువు దృష్టి పడడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు నెర వేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. సామాజికంగా కూడా రాజపూజ్యాలు కలు గుతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.

మీనం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్నశుక్రుడి మీద రాశ్యధిపతి గురువు దృష్టి పడినందు వల్ల అనేక వృత్తి, ఉద్యోగాల్లోనూ, కుటుంబంలోనూ అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. లాభదా యక పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.



