YSRCP: ‘టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’.. చంద్రబాబుపై సజ్జల షాకింగ్ కామెంట్స్..
2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ప్రభావితం చేయాలనుకుంటున్నారన్నారు వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. వాలంటరీలు ఓటర్లని ప్రభావితం చేస్తారని ఈసీకి చంద్రబాబు చెప్పారా లేదా అని ప్రశ్నించారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ప్రభావితం చేయాలనుకుంటున్నారన్నారు వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. వాలంటరీలు ఓటర్లని ప్రభావితం చేస్తారని ఈసీకి చంద్రబాబు చెప్పారా లేదా అని ప్రశ్నించారు. వాలంటరీలు గోని సంచులు మోసే వాళ్ళని.. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారని హేళనగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజం కాదా అని నిలదీశారు. వాలంటీరీలను ఉద్దేశించి పవన్ ,చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇప్పుడు మర్చిపోతారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వాలంటరీలకు రూ.10వేలు ఇస్తానని చెప్తే నమ్మే స్థితిలో వాళ్లు లేరని, చంద్రబాబు చెప్పే మోసపూరిత హామీలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మేందుకు సిద్దంగా లేరన్నారు. గతంలో వాలంటరీ వ్యవస్థను తీసేస్తానని చెప్పి.. ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు ఇస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరన్నారు.
1995లో చంద్రబాబు ఎలా ఉన్నారో 2024 లో కూడా అలాగే ఉన్నారని చెప్పారు. వాలంటరీ వ్యవస్థను రద్దుచేసి జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి తమ పార్టీ వాళ్లనే నియమించుకుంటారని చెప్పారు. టీడీపీ పార్టీ వాళ్లకు మాత్రమే పథకాలు ఇవ్వాలని చంద్రబాబు చెబుతారని విమర్శించారు. సొంత పార్టీ నేతలకు ఆదాయం పెరగడానికి.. అవినీతి చేయడానికి మళ్లీ చంద్రబాబు ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. అయితే ఈసారి చంద్రబాబు అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. నిమ్మగడ్డ రమేష్తో చంద్రబాబు ఈసీకి కంప్లైంట్ ఇప్పించారని ఆరోపించారు. వాలంటీర్లు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి అనుకుంటే నాలుగేళ్లలోనే చేసేవారని చెప్పారు. కానీ ఇప్పుడు తొలగిస్తే ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటారా అని అడిగారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయని, అర్హులకు న్యాయం జరిగిందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఏం చెప్పినా వినరు.. నమ్మరు అని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరన్నారు.
వాలంటీర్ వ్యవస్థపై చేయాల్సింది అంతా చేసి మళ్ళీ జగన్ మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం, ఒంగోలులో తమ పార్టీ నేతలపై దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టించారన్నారు. ఎన్నికల్లో సింపతీ కోసం అసలు గొడవలు చేస్తుంది టిడిపి వాళ్లని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా మరోసారి వైసీపీ విక్టరీ సాధించబోతోందని జోస్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడం లేదని గ్రహించే చంద్రబాబు వెక్కిలితనంతో, నిస్పృహతో మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారన్నారు. 2019లో కూడా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఈసీ దగ్గర రచ్చ చేశారని గుర్తు చేశారు. 2024లో కూడా అదే రచ్చ చేయాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలిపారు. అయితే వైసీపీ నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటోందని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..