ఈ సమయంలో చేపల వేట నిషేధం.. మత్స్యకారులకు కీలక ఆదేశాలు..
సముద్ర జలాల్లో మోటారు, సంప్రదాయ బోట్ల ద్వారా అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. సముద్ర జలాల్లో వివిధ చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడం ద్వారా సుస్థిరతను సాధించేందుకు మత్స్య సంపద వేటను నిషేధించారు.
సముద్ర జలాల్లో మోటారు, సంప్రదాయ బోట్ల ద్వారా అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. సముద్ర జలాల్లో వివిధ చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడం ద్వారా సుస్థిరతను సాధించేందుకు మత్స్య సంపద వేటను నిషేధించారు. నిషేధ ఉత్తర్వులను ధిక్కరించి సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్తే సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం 1994 సెక్షన్ (4)ను అనుసరించి చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నారు.
యజమానుల బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనపరుచుకొని, జరిమాన విధించనున్నరు. ప్రభుత్వం అందించే డీజిల్ రాయితీ సహా అన్ని రకాల రాయితీలను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర జలాల్లో యాంత్రిక పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులు నిషేధ ఉత్తర్వులను అనుసరించి మత్స్య అభివృద్ధి సహకరించాలని కోరుతున్నారు. వేట నిషేధ కాలం సక్రమంగా అమలయ్యేలా మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చెయ్యనున్నారు. వేటకు వెళ్లని ఈ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం కనీస భృతిని ఇస్తూ వస్తోంది. ఈ సారి కూడా అలాగే నష్టపరిహారం చెల్లించేందుకు సిద్దమైంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..