Ambati Rayudu: జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు.. అధికారిక ప్రకటన
క్రికెట్‌కి గుడ్ బై చెప్పి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు.. వైసీపీ నుంచి గుంటూరు లోక్‌సభ టిక్కెట్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనాని పవన్‌కు కలిశారు. అధికారికంగా పార్టీలో చేరలేదు. ఇక బుధవారం జనసేన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల చేసింది. అందులో...
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. వైసీపీ పథకాలను ప్రశంసిస్తూ.. ఆ పార్టీ నేతలకు అంబటి దగ్గరయ్యారు. గత ఐపీఎల్‌లో ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన అంబటి రాయుడు.. ఆ తర్వాత వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. గుంటురూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. ఆ తర్వాత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆడుదాం ఆంధ్రాలో ఫుల్ యాక్టివ్‌గా వ్యవహరించారు. గుంటూరు ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతానికి ప్లేస్ ఖాళీగా లేదు.. కొన్ని రోజులు బెంచ్ మీద ఉండి సేవ చేయాల్సిందే అనేలా పార్టీలో సంకేతాలు వచ్చాయి. దీంతో లాభం లేదు అనుకున్న అంబటి.. పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం వల్లే కొన్నాళ్లు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్టు.. రాయుడు చెప్పుకొచ్చారు. అయితే ఆ వెంటనే జనసేన అధినేత పవన్‌తో భేటీ అవ్వడం ఆసక్తి రేపింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచనల మేరకే పవన్‌తో భేటీ అయినట్లు అంబటి తెలిపారు. ఆ తర్వాత తన వ్యక్తిగత పనులు, క్రికెట్‌తో బిజీ అయిన అంబటి.. ఇప్పుడు అనూహ్య రీతిలో జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులు అవ్వడం ఆసక్తి రేపుతోంది.
మార్చి 27 వ తేదీన సిద్ధం అంటూ అంబటి ఓ ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ ఆయన వైసీపీ పంచనే చేరనున్నారా అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇంతవరకు ఏ విషయం చెప్పని అంబటి రాయుడు తాజాగా మరో ట్వీట్ వేసి దానికి గుట్టు విప్పాడు చెప్పాడు. సిద్ధం అని తాను చెప్పింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం చేయడానికి సిద్ధం.. అందుకు కలిసి నడుద్దాం అంటూ తాజాగా ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Pavan annanu cm cheyyadaniki sidham !! Kalisi saadhidham..
— ATR (@RayuduAmbati) April 10, 2024
జనసేన స్టార్ క్యాంపెయినర్స్ వీరే…
నాగబాబు, అంబటి రాయుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ, నటుడు ఆర్కే నాయుడు, .. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శ్రీనుల పేర్లను స్టార్ క్యాంపెనర్లుగా పేర్కొంటూ జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.
జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు#VoteForGlass pic.twitter.com/T5HzqMURqm
— JanaSena Party (@JanaSenaParty) April 10, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..