నల్లారి సోదరుల ఓటమే తండ్రి కొడుకుల టార్గెట్.. చిత్తూరులో కాకరేపుతున్న రాజకీయం..

చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో ఆ రెండు కుటుంబాల మధ్య ఇప్పటిదాకా డైరెక్ట్ ఫైట్ లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతున్నా ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడిందిలేదు. చాలా కాలం ఒకే పార్టీలో ఉండడంతో ఇది సాధ్యం కాలేదేమో కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాలు ప్రత్యక్షంగా తలపడేందుకు అవకాశం దక్కింది.

నల్లారి సోదరుల ఓటమే తండ్రి కొడుకుల టార్గెట్.. చిత్తూరులో కాకరేపుతున్న రాజకీయం..
Nallari Vs Peddireddy
Follow us
Raju M P R

| Edited By: Srikar T

Updated on: Apr 11, 2024 | 7:59 AM

చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో ఆ రెండు కుటుంబాల మధ్య ఇప్పటిదాకా డైరెక్ట్ ఫైట్ లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతున్నా ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడిందిలేదు. చాలా కాలం ఒకే పార్టీలో ఉండడంతో ఇది సాధ్యం కాలేదేమో కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాలు ప్రత్యక్షంగా తలపడేందుకు అవకాశం దక్కింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ శత్రుత్వం ఉన్న నల్లారి.. పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య పోటీ ఇప్పుడు బిగ్ ఫైట్‎గా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాజకీయ కుటుంబాలకు రాజకీయ నేపథ్యమే కాదు బద్ధ శత్రుత్వం కూడా కొన్ని దశాబ్దాలుగా ఉంది. నల్లారి..పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా కత్తులు దూసుకునేందుకు కారణం అయ్యింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు.. నల్లారి కుటుంబం నుంచి అన్నదమ్ములు పోటీలో ఉండడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాజకీయ శత్రుత్వం ఉన్న రెండు కుటుంబాల మధ్య పోటీ చర్చగా మారింది.

రాజంపేట పార్లమెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన బిజెపి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వైసిపి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్య పోటీ అయినా ఫైట్ నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి‎గా మారింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కొడుకు మిధున్ రెడ్డి టార్గెట్‎గానే మాజీ నల్లారి కిరణ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అనుచరుల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు పీలేరు అసెంబ్లీ నుంచి మాజీ సీఎం కిరణ్ సోదరుడు కిషోర్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో కూటమి అభ్యర్థులుగా ఉన్న అన్నదమ్ముల ఓటమి లక్ష్యంగా పెద్దిరెడ్డి వ్యూహలు పన్నుతున్నారు. నల్లారి కిరణ్, నల్లారి కిషోర్ ఇద్దరినీ ఓడించాలని కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డి ఈ మేరకు దూకుడు పెంచారు. దీంతో నల్లారి – పెద్దిరెడ్డి మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పుట్టిస్తున్నాయి.

పొలిటికల్ ఫైట్ కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ ఘాటైన విమర్శలే చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కిరణ్‎కు కూడా అదే రీతిలో కౌంటర్ అటాక్ ఇస్తున్నారు తండ్రి,కొడుకులు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య వైరం ఇప్పుడు డైలాగ్ వార్‎గా మారింది. ఈమధ్యనే పుంగనూరులో కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి‎పై కిరణ్ చేసిన కామెంట్స్‎కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చారు. రొంపిచర్లలో పర్యటించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందులో పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాడి, మామిడి రైతాంగాన్ని నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి అంటే పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే అభివృద్ధి అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన ప్రాజెక్ట్ పనులను ప్రస్తావిస్తున్న నల్లారి కిషోర్.. పెద్దిరెడ్డి కుటుంబం అధికార మదంతో రెచ్చిపోతుందని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పుంగనూరుకు 5ఏళ్లలో చేసిన నిర్వాహకమేంటని ప్రశ్నిస్తున్న కిరణ్ మట్టి, మైన్స్, రెడ్ శాండిల్, ఇసుకలో భారీ దోపిడీకి పాల్పడ్డారని అడుగడుగునా ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి అక్రమాలను అడ్డుకునేలా ఓటుతో బుద్ధి చెప్పాలని కోరుతున్నారు కిరణ్. పెద్దిరెడ్డిని చిత్తుగా ఓడించాలంటున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోపిడీకి, ఆరాచకానికి ప్రజలే పుల్ స్టాప్ పెట్టాలన్నారు. పెద్దిరెడ్డి నుంచి విముక్తి కావాలా, బానిసత్వం కొనసాగాలా మీరే నిర్ణయించుకోవాలని ప్రచారం చేస్తున్న కిరణ్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు, వారి దౌర్జన్యాలకు అక్రమ కేసులకు ఇలాగే నలుగుతారో, స్వేచ్ఛగా బతుకుతారో మీరే నిర్ణయించుకోవాలంటున్నారు.

ఇక నల్లారి టార్గెట్‎గా తండ్రి కొడుకులు ఇద్దరు ఘాటుగానే స్పందిస్తున్నారు. నల్లారి కిషోర్ తన ప్రధాన శత్రువుగా ప్రకటించిన పెద్దిరెడ్డి.. నల్లారి సోదరుల ఓటమి టార్గెట్‎గా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ సూట్ కేస్‎తో హైదరాబాద్ నుంచి వచ్చిన మాజీ సీఎం కిరణ్ ఎన్నికల తర్వాత సూట్ కేస్ సర్దుకుని వెళ్లిపోతారంటున్నారు. సీఎంగా ఉన్న సమయంలో అభివృద్ధిని అడ్డుకున్న కిరణ్ ఇప్పుడు నీతులు చెప్పుతున్నారని విమర్శిస్తున్నారు. పుంగనూరు ప్రాంతంలో పించా ప్రాజక్టు మంజూరు చేసి పనులు ప్రారంభించే సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. కిరణ్ పుట్టింది ఉంటున్నది హైదరాబాద్‎లోనేనని కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదని కౌంటర్ ఇస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. సొంతూరికి వస్తే అర్ అండ్ బిలో ఉంటున్న కిరణ్ విమర్శలు చేయడమా అని ప్రశ్నిస్తున్నారు.

జగన్‎ను జైల్లో పెట్టించింది కిరణ్ కుమార్ రెడ్డేనని ఇప్పుడే ముఖం పెట్టుకుని ఇక్కడకు వచ్చారని అడుగుతున్నారు రామచంద్రారెడ్డి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అనేక కుట్రలతో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడు ప్రజలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందంటున్నారు పెద్దిరెడ్డి. ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఒడించాలంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఒక ఓటు తగ్గినా పర్వాలేదు కానీ, ఎంపీగా కిరణ్‎పై పోటీ చేస్తున్న మిథున్ రెడ్డికి భారీ మెజారిటీ రావాలని కోరుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..