Nandamuri Balakrishna: ఏపీ ఎన్నికల ప్రచార బరిలోకి బాలయ్య.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా క్యాంపెనింగ్
2024 ఎన్నికలు ఏపీలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుండటంతో స్టార్ క్యాంపెనింగ్ కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ స్టార్స్ ఆయా పార్టీల తరపున జోరుగా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ కోసం టాలీవుడ్ నటులు ప్రచారం చేస్తారనే టాక్ వినిపిస్తుండగా, ఇక మెగాస్టార్ చిరంజీవి ఏపీ రణరంగంలోకి అడుగు పెడుతారని తెలుస్తోంది.
2024 ఎన్నికలు ఏపీలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుండటంతో స్టార్ క్యాంపెనింగ్ కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ స్టార్స్ ఆయా పార్టీల తరపున జోరుగా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ కోసం టాలీవుడ్ నటులు ప్రచారం చేస్తారనే టాక్ వినిపిస్తుండగా, ఇక మెగాస్టార్ చిరంజీవి ఏపీ రణరంగంలోకి అడుగు పెడుతారని తెలుస్తోంది. అయితే ఇక సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 12వ తేదీ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ రావాలి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మూడోసారి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ 1985 నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం, మిత్రపక్షాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. సైకిల్ రావాలి బస్సు యాత్రను ప్రారంభించే ముందు బాలయ్య శుక్రవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఈ నెల 12న కదిరి, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరుసటి రోజు అనంతపురం జిల్లా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 14న బనగానపల్లిలో నంద్యాలలో పర్యటించి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఏప్రిల్ 15న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించే ఈ యాత్ర అదే రోజు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కర్నూలు సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది.
ఈ నెల 16న బాలకృష్ణ బస్సుయాత్ర కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి మండల కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలైన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం మీదుగా సాగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ, ఆలూరులో తన యాత్రను కొనసాగించి 17న అనంతపురం జిల్లా రాయదుర్గంలోకి ప్రవేశిస్తారు. నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగుతుండటంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం కొనసాగనుంది.