Pidakala Samaram: కైరుప్పలలో హోరాహోరీగా సాగిన పిడకల సమరం.. వీరభద్ర స్వామికి భద్రకాళీకి వైభవంగా కళ్యాణం..
కర్నూలు జిల్లాలో సంప్రదాయ పిడకల సమరం హోరాహోరీగా సాగింది. వేలాది మంది సమక్షంలో జరిగిన పిడకల సమరం ఉత్కంఠ రేపింది. దశాబ్దాల కాలం నాటి పిడకల సమరం.. ఈసారి కూడా వైభవంగా జరిగింది. భద్రకాళి, వీరభద్రస్వామి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు పిడకలు విసురుకుని భక్తిని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో భద్రకాళిదేవి, వీరభద్రస్వామి ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాదిని పురస్కరించుకుని పిడకల సమరం నిర్వహిస్తారు. గ్రామస్థులు వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా కదిలారు స్థానికులు. ఎవరికివారు పై చేయి సాధించేందుకు పిడకల సమరంలో హోరాహోరీగా తలపడ్డారు.
దశాబ్దాల కాలం నాటి నుంచి వస్తున్న సంప్రదాయం పిడకల సమరం ఈసారి కూడా వైభవంగా జరిగింది. భద్రకాళి వీరభద్ర స్వామి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి సిద్ధం చేసుకున్న పిడకలతో ఒకరిపై మరొకరు విసురుకుని తమ భక్తిని చాటుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంబరాన్ని తాకుతున్న ప్రస్తుత కాలంలో పూర్వ సాంప్రదాయాలు ఇక్కడి ప్రజలు పాటిస్తున్నారు. ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ భక్తి భావాలతో ముందుకు సాగుతున్నారు. ఆ భక్తి శ్రద్ధలతో అక్కడ సాగే క్రీడనే ఉగాది మర్నాడు జరిగే పిడికల సమరం.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్ప గ్రామంలో తేత్ర యుగంలో నిర్మించిన వీరభద్ర స్వామి భద్రకాళీ అమ్మ వారి ఆలయం ఉంది. తేత్ర యుగంలో వారి ఇద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారంలో కొంత ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం తో స్వామి అమ్మ వారి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ ఘర్షణ కారణాలు ఇద్దరి భక్తులు రెండు వర్గాలు గా విడిపోయారట. స్వామి వారు భద్ర ఖాళీ అమ్మ వారి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్తారు. ముందుగా అమ్మ వారి భక్తులు స్వామి వారిపై ఉన్న కోపంతో వీరభద్ర స్వామి ని అవమానించాలని భావిస్తారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలను వేస్తారు. విషయం తెలుసుకున్న వీరభద్ర స్వామి భక్తులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అమ్మ వారి భక్తులపై పిడకలను వేస్తూ ఎదురు దాడికి దిగారంట.
ఇప్పటికి అదే ఆచారం.
ఇప్పటికి అక్కడ ప్రజలు ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ పెళ్లి ఘర్షణ భక్తులు కొనసాగించడం విశేషం..ఉగాది పండుగ మరుసటి రోజు ఈ సంప్రదాయ పిడకల సమరం జరుపుకోవడం ఒక ప్రత్యేకత.
దెబ్బలకు మందు స్వామి వారి బండారు..
పిడికల సమరం లో గాయపడ్డ భక్తులు స్వామి వారి ఆలయంలో పూజలు చేసి అక్కడ ఉన్న పశువు రంగులో ఉన్న బండారు ను రాసుకొని వెళ్తారు. ఈ ఆచారం త్రేతాయుగంలో యుగంలో స్వామి అమ్మ వారి భక్తులు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారు బ్రహ్మ దేవుడు ఆజ్ఞ గా భావించారంటా. అదే పురాతన పద్ధతి ఇప్పుడు పాటించడం ప్రత్యేకత..
పిడకల సమరం తర్వాత ఇద్దరి పెళ్లి.
స్వామి అమ్మ వారి మధ్య జరుగుతున్న పిడికల సమరం గురించి వీరభద్ర స్వామి తండ్రి శివుడు బ్రహ్మదేవుడు దృష్టి కి తీసుకెళ్లినట్లు ఆలయ చరిత్రలోనే ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. స్వయంగా పిడికల సమరం జరిగే సమయంలో దేవలోకం నుంచి భూలోకానికి బ్రహ్మదేవుడు వచ్చడంట. వారి మధ్య రాజీ కుదూర్చి పెళ్ళిచేడంట
అదే సంప్రదాయం ప్రకారం కళ్యాణం
అదే పద్ధతి ఇప్పుడు అక్కడ గ్రామస్థులు పిడికల సమరం జరిగిన రోజు తెల్లవారుజామున వీరభద్ర స్వామి కి భద్రకాళీ అమ్మ వారికి వేదపండితుల మధ్య కళ్యాణం జరిపించారు.
పిడికల సమరం లో గాయాలు.
ఉగాదిని పురస్కరించుకుని పిడకల సమరం నిర్వహిస్తారు. గ్రామస్థులు వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా కదిలారు స్థానికులు. ఎవరికివారు పై చేయి సాధించేందుకు పిడకల సమరంలో హోరాహోరీగా తలపడ్డారు. వారికి మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. ఒకచోట కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు సమరం కొనసాగింది. ఇక.. దెబ్బలు తగిలినవారు స్వామివారి విభూది రాసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. పిడికల సమరంలో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి.. గాయపడ్డ వారు స్వామి ఆలయానికి వెళ్లి బండారు రాసుకొని వారి వారి ఇంటికి వెళ్లిపోయారు. ఇది సంప్రదాయం అని గాయపడ్డ వారు స్పష్టంచేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..