Eid ul-Fitr 2024: కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు.. ప్రార్ధనా సమయం ఎప్పుడంటే..
చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి. గురువారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీలోని జామా మసీదులో నమాజ్ చేస్తారు. ఈద్ రోజు ఉదయం ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఈ రోజున ముస్లింలు ఉదయాన్నే కొత్త బట్టలు ధరించి, నమాజ్ చేసి శాంతి కోసం ప్రార్థిస్తారు. ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు
దేశంలోని అనేక ప్రాంతాలలో బుధవారం సాయంత్రం షవ్వాల్ నెల చంద్రుడు కనిపించాడు. అంటే ఈ రోజు ఈద్ పండగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. కేరళ, కాశ్మీర్, లడఖ్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈద్ బుధవారం జరుపుకోగా… ఇతర రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రం చంద్రుడు కనిపించాడు. దీంతో ఈద్ పండుగను మిగిలిన రాష్ట్రాల్లో నేడు ( గురువారం) జరుపుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ తర్వాత షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.
ఈద్ రోజు ఉదయం ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఈ రోజున ముస్లింలు ఉదయాన్నే కొత్త బట్టలు ధరించి, నమాజ్ చేసి శాంతి కోసం ప్రార్థిస్తారు. ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అనంతరం ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ.. వివిధ మార్గాల్లో ఈద్ జరుపుకోవడం ప్రారంభిస్తారు.
ఈద్ ప్రార్థనలు ఎప్పుడు చేస్తారు?
చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి. గురువారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీలోని జామా మసీదులో నమాజ్ చేస్తారు.
జామియా సనాబిల్, ఓఖ్లాలో ఉదయం 7:00 గంటలకు, ఫతేపురి మసీదులో ఉదయం 7:30 గంటలకు, ఖాద్రీ మసీదులో, జాకీర్ నగర్‌లో ఉదయం 7:30 గంటలకు, జామా మసీదులో, సెక్టార్ 8 నోయిడాలో ఉదయం 7:30 గంటలకు, ఈద్గా, జాఫ్రాబాద్‌లో నమాజ్ ఉదయం 7:45 గంటలకు మరియు షియా జమా మసీదు, కాశ్మీరీ గేట్ వద్ద ఉదయం 8:00 గంటలకు అందించబడుతుంది.
ईद उल-फ़ित्र की दिली मुबारकबाद। pic.twitter.com/tnaMjt9hQV
— Akhilesh Yadav (@yadavakhilesh) April 10, 2024
ఆచారం ఏమిటి?
ఈద్-ఉల్-ఫితర్ సమయంలో తీపి వంటకాలు ముఖ్యంగా ఖీర్ ను తయారు చేస్తారు. ఇంట్లో తయారుచేసిన స్వీట్లు,వంటలను ఒకరికొకరు ప్రేమతో వడ్డిస్తారు. ఈద్ సందర్భంగా బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇందులో కొన్ని బహుమతి వస్తువులు లేదా డబ్బుల రూపంలో ఉంటాయి. అంతేకాదు ఈ రోజు చేసే దానానికి విశిష్టత ఉందని నమ్ముతారు.
ఈద్ ఉల్ ఫితర్ అంటే ఏమిటి?
ఈద్ ఉల్ ఫితర్‌ను అరబిక్, ఆసియా దేశాలలో ఈద్ అల్ ఫితర్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ అత్యంత ముఖ్యమైన, ప్రత్యేకమైన పండుగ. రంజాన్-ఎ-పాక్ మాసం పూర్తయిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఈ పండుగ ఉపవాసం ముగింపుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారందరికీ అల్లాహ్ నుండి ఈద్ అల్ ఫితర్ బహుమతి.
రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు అల్లాను ఆరాధించడానికి.. అతని మార్గాన్ని అనుసరించడానికి .. అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా దీనిని జరుపుకుంటారు. సాంప్రదాయకంగా దాదాపు అన్ని ముస్లిం దేశాలలో ఈద్ ఉల్ ఫితర్ మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడం ఎలా ప్రారంభమైంది?
ఈద్ ఉల్ ఫితర్ పండుగను మొదటిసారిగా క్రీ.శ. 624లో జరుపుకున్నారని.. ఈ ఈద్‌ను మహమ్మద్ ప్రవక్త జరుపుకున్నారని నమ్ముతారు. ఈ ఈద్‌ను ఈద్ ఉల్-ఫితర్ అంటారు. ఈ రోజున ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ బదర్ యుద్ధంలో విజయం సాధించారని నమ్ముతారు. విజయానికి గుర్తుగా స్వీట్స్ పంచి రకరకాల వంటలతో సంబరాలు చేసుకున్నారట.
ఈద్ రోజున ముస్లింలు రంజాన్ నెల ముగింపును జరుపుకుంటారు. ఖురాన్ ఇచ్చిన అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇస్లాంలో ఈద్ పండుగలో ఐదు సూత్రాలను అనుసరించడం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఐదు సూత్రాలు నమాజ్, హజ్ తీర్థయాత్ర, విశ్వాసం, ఉపవాసం , జకాత్. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి ఈద్ నమాజ్ చేసే ముందు చేసే దానం లేదా జకాత్ ఇవ్వాలని నమ్మకం.
ఈద్ ఉల్ ఫితర్ ప్రాముఖ్యత
ఇస్లాం మతంలో రంజాన్ మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెల మొత్తం ముస్లింలు రోజా అంటే ఉపవాసం ఉంటారు. ఎక్కువ సమయం అల్లాను ఆరాధించడంలో గడుపుతారు. అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉపవాసం ముగింపు సందర్భంగా ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్‌ను మీథీ ఈద్ అని కూడా పిలుస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..