- Telugu News Photo Gallery Don't keep these in your wallet at all if you want to grow financially, check here is details
Vastu Tips: మీరు ఆర్థికగా ఎదగాలంటే.. మీ పర్సులో వీటిని అస్సలు ఉంచకండి!
సాధారణంగా అందరి దగ్గరా పర్సులు ఉంటాయి. వాటిల్లో డబ్బులు ఇంకా ఫొటోలు, కార్డులు.. ఇలా అవసరాన్ని బట్టి అన్నీ పెడతారు. అయితే మీ పర్సు వలన కూడా మీరు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావచ్చు. మీ పర్సులో వేటిని పడితే అవి అస్సలు పెట్టకూడదు. మరి మీ వ్యాలెట్‌లో ఎలాంటివి ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బులను మీ పర్సులో పెట్టేటప్పుడు.. ఎలా పడితే అలా నలిపేసి పెట్టకూడదు. దీని వలన డబ్బును అవమానించినట్టు..
Updated on: Apr 10, 2024 | 4:46 PM

సాధారణంగా అందరి దగ్గరా పర్సులు ఉంటాయి. వాటిల్లో డబ్బులు ఇంకా ఫొటోలు, కార్డులు.. ఇలా అవసరాన్ని బట్టి అన్నీ పెడతారు. అయితే మీ పర్సు వలన కూడా మీరు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావచ్చు. మీ పర్సులో వేటిని పడితే అవి అస్సలు పెట్టకూడదు. మరి మీ వ్యాలెట్‌లో ఎలాంటివి ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్బులను మీ పర్సులో పెట్టేటప్పుడు.. ఎలా పడితే అలా నలిపేసి పెట్టకూడదు. దీని వలన డబ్బును అవమానించినట్టు అవుతుంది. ఎలాంటి మడతలు లేకుండా పెట్టుకోవాలి.

చాలా మంది అనారోగ్యంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లినప్పుడు.. మందులను కూడా పర్సులో పెడుతూ ఉంటారు. ఇలా పొరపాటున కూడా ట్యాబ్లెట్స్‌ని పర్సులో పెట్ట కూడదు. అవసరం అయితే వేరే జేబులో పెట్టుకోవడం బెటర్.

అదే విధంగా చాలా మంది వారి ప్రేమకు గుర్తుగా చనిపోయిన కుటుంబ సభ్యుల ఫొటోలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ల ఫొటోలు మీ పర్సులో పెట్టుకోకూడదట.

డబ్బుకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. డబ్బుకు గౌరవం ఇవ్వడం వల్ల.. మరింత ఆకర్షణ అవుతుంది. కాబట్టి కేవలం పర్సులోనే కాకుండా ఇంట్లో కూడా డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.




