Ayodhya: బాల రామయ్యకు 5కోట్ల విలువైన బంగారు రామాయణం.. ఘనంగా ప్రారంభమైన నవమి వేడుకలు

దాదాపు 500 ఏళ్ల తర్వాత బాల రామయ్య జన్మ దినోత్సవ వేడుకలను (శ్రీ రామ నవమిని) ఘనంగా జరపడానికి శ్రీ రామ జన్మ భూమి ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు శ్రీ రామ నవమి సందర్భంగా భక్తులు బాల రామయ్యకు కానుకలను సమర్పిస్తున్నారు. తాజాగా ఓ విశ్రాంత ప్రభుత్వ అధికారి రామయ్య భక్తుడు బాల రామయ్యకు బంగారు రామాయణాన్ని కానుకగా సమర్పింహ్చాడు. ఏడు కిలోల బంగారం ఉపయోగించి తయారు చేసిన  బంగారు పేజీలపై వ్రాసిన ఈ రామాయణం రామయ్య గర్భగుడిలో ప్రతిష్టించబడింది.

Ayodhya: బాల రామయ్యకు 5కోట్ల విలువైన బంగారు రామాయణం.. ఘనంగా ప్రారంభమైన నవమి వేడుకలు
Gold Ramayana Book
Follow us
Surya Kala

|

Updated on: Apr 11, 2024 | 7:36 AM

కోట్లాది మంది హిందువుల కల తీరి అయోధ్యలో బాల రామయ్య కొలువు దీరాడు. సుదీర్ఘ కాలం నిరీక్షకు తెరదించుతూ జన్మ భూమిలో రామయ్య పూజలను అందుకుంటున్నాడు. అంతేకాదు దాదాపు 500 ఏళ్ల తర్వాత బాల రామయ్య జన్మ దినోత్సవ వేడుకలను (శ్రీ రామ నవమిని) ఘనంగా జరపడానికి శ్రీ రామ జన్మ భూమి ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు శ్రీ రామ నవమి సందర్భంగా భక్తులు బాల రామయ్యకు కానుకలను సమర్పిస్తున్నారు. తాజాగా ఓ విశ్రాంత ప్రభుత్వ అధికారి రామయ్య భక్తుడు బాల రామయ్యకు బంగారు రామాయణాన్ని కానుకగా సమర్పింహ్చాడు. ఏడు కిలోల బంగారం ఉపయోగించి తయారు చేసిన  బంగారు పేజీలపై వ్రాసిన ఈ రామాయణం రామయ్య గర్భగుడిలో ప్రతిష్టించబడింది.

రామచరితమానస్‌

గర్భ గుడిలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట సమయంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి లక్ష్మీ నారాయణ్ తన జీవితంలో సంపాదించిన సంపాదన అంతా రామయ్యకే సొంతం అని చెప్పారు. ఇపుడు తాను చెప్పిన మాటను పాటిస్తూ బంగారంతో తయారు చేసిన రామచరిత మానస్ పుస్తకాన్ని సిద్ధం చేశారు. సుమారు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 151 కిలోల బంగారంతో రామచరిత మానస్ ను 10,902 శ్లోకాలతో కూడిన రామాయణాన్ని సమ్పరించారు. 480-500 పేజీలు ఉన్న ఈ రామాయణంలో ప్రతి పేజీ 24 క్యారెట్ల బంగారం పూత పూయబడింది.

కలశ స్థాపనతో నవమి వేడుకలు ప్రారంభం

అయోధ్యలో  శ్రీ రామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4:00 గంటలకు బాల రామయ్యకు జలాభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడిలో వెండి కలశం ఏర్పాటు చేసి 11 మంది వేద పండితులు వాల్మీకి రామాయణంలోని నవః పారాయణం, రామ రక్షాస్త్రోత్, దుర్గా సప్తశతి పఠనం చేసి నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు.

ఇవి కూడా చదవండి

మొదటి రోజు 2 లక్షల మంది భక్తులు సరయూ నదిలో స్నానమాచరించి బాలరామయ్యను దర్శించుకున్నారు. హనుమాన్ గర్హి లో పూజలు చేశారు. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిసారిగా స్వామివారి వస్త్రాల శైలిని మార్చినట్లు . శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..