AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన..

ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన..
Ap Inter Result
Follow us
Srikar T

| Edited By: TV9 Telugu

Updated on: Apr 12, 2024 | 11:37 AM

ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఏప్రిల్ 12న పరీక్షా ఫలితాలు విడుదల అవుతాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే నిజం చేస్తూ తాజాగా ఇంటర్ ఫలితాల తేదీని ప్రకటించడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) రాష్ట్రంలోని వివిధ కేంద్రాలలో పరీక్షలను నిర్వహించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రెండూ ఒకేసారి రోజువారీ షిఫ్ట్‌లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి

ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఒకేషనల్ కోర్సుకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. అందరి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 12న శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పరీక్షా ఫలితాలను పొందాలనుకునే విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా అధికారిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే టీవీ9 వెబ్ సైట్ ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.  ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేస్తారా.. లేక గ్రేడ్ ల వారిగా ఫలితాలను విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. వాటి ఫీజు వివరాలు కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..