NEET UG 2024 Registration Window Opened: నీట్ యూజీ 2024 దరఖాస్తుకు మళ్లీ అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న దరఖాస్తు ప్రక్రియ
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 (నీట్ యూజీ) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అప్లికేషన్ విండో పునఃప్రారంభమైంది. ఈ మేరకు దరఖాస్తుకు మరో అవకాశం ఇస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన వెలువరించింది. అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తుకు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 (నీట్ యూజీ) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అప్లికేషన్ విండో పునఃప్రారంభమైంది. ఈ మేరకు దరఖాస్తుకు మరో అవకాశం ఇస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన వెలువరించింది. అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తుకు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 9, 10 తేదీల్లో చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు లింకు ఈ రోజు రాత్రి 10.50 గంటలకు ముగుస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపులకు 11.50 గంటల వరకు అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
NEET UGకి దరఖాస్తు చేసుకోసుకునే అభ్యర్ధులు దరఖాస్తు రుసుము కింద జనరల్/ NRI వర్గానికి చెందిన అభ్యర్థులకు రూ. 1700/-, జనరల్-ఈడబ్ల్యూఎస్/ OBC-NCL కేటగిరీకి చెందిన అభ్యర్థులకు రూ. 1600/-, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్ అభ్యర్ధులు రూ.1000 ల చొప్పున చెల్లించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET (UG) – 2024 మే 5వ తేదీన మధ్యాహ్నం 02:00 నుంచి సాయంత్రం 05:20 గంటల వరకు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 571 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పెన్ , పేపర్ (ఆఫ్‌లైన్) మోడ్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నీట్ అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేసుకోవచ్చు.
‘నీట పరీక్ష తేదీలో మార్పు లేదు.. పుకార్లను నమ్మొద్దు’
నీట్ (యూజీ) 2024 పరీక్ష వాయిదాపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసిన అభ్యర్థుల చేతికి ఉన్న సిరా గుర్తు వల్ల పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని గత కొంత కాలంగా ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పుకార్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొట్టివేసింది. ఓటు వేసిన వ్యక్తి వేలిపై ఉన్న సిరా వల్ల పరీక్ష కేంద్రంలోకి అనుమతించరనేది పూర్తిగా అవాస్తవమని, అలాంటి నిబంధన ఏమీ లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇటువంటి నకిలీ వార్తలను నమ్మొద్దని, రాబోయే పరీక్ష కోసం చదువుపై దృష్టి పెట్టి చదవాలని సూచించింది. నీట్ (యూజీ) పరీక్షను సంబంధించి ఎలాంటి సందేహాలకు అయినా 011-40759000 నెంబర్ లేదా neet@nta.ac.in మెయిల్ చేయవచ్చని పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.