TS TET 2024 Last Date: తెలంగాణ టెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈసారి భారీగా తగ్గిన దరఖాస్తులు! కారణం ఇదే..

తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకగన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. తాజా ప్రకటనతో దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 20 వరకు పొడిగించారు. ఏప్రిల్‌ 9వ తేదీ నాటికి కేవలం 1.93 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి కనీసం దరఖాస్తుల సంఖ్య 2 లక్షలకు కూడా..

TS TET 2024 Last Date: తెలంగాణ టెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈసారి భారీగా తగ్గిన దరఖాస్తులు! కారణం ఇదే..
TS TET 2024 Last Date
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2024 | 2:44 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10: తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకగన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. తాజా ప్రకటనతో దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 20 వరకు పొడిగించారు. ఏప్రిల్‌ 9వ తేదీ నాటికి కేవలం 1.93 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి కనీసం దరఖాస్తుల సంఖ్య 2 లక్షలకు కూడా మించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన టెట్‌ పరీక్షకు దాదాపు 2.91 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గత టెట్‌ పరీక్షతో పోల్చితే ఈసారి దాదాపు 91 వేల దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2012 నుంచి టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి టెట్‌ నిర్వహిస్తున్నారు. 2016లో జరిగిన టెట్‌ పరీక్షకు 3.40 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 2017లో 3.29 లక్షల మంది, 2022లో 3.79 లక్షల మంది, 2023లో 2.91 లక్షల మంది అభ్యర్ధులు టెట్‌ పరీక్షకు పోటీపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్‌లో అర్హత సాధించారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతోపాటు గతంలో టెట్‌లో అర్హత పొందిన వారు కూడా మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు. అయితే ఈసారి మాత్రం అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది. గతేడాది వరకు టెట్‌లో రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే దరఖాస్తు రుసుం ఉండేది. కానీ ఈసారి ఒక్కో పేపర్‌కు దరఖాస్తు ఫీజు ఏకంగా రూ. 1000కి పెంచారు. ఈక్రమంలో దరఖాస్తుల సంఖ్య తగ్గిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే 11,062 పోస్టులకు డీఎస్సీ ప్రకటన వెలువడటంతో ఇప్పటికే అర్హత పొందిన వారు డీఎస్సీపై ఫోకస్‌ పెడుతున్నారు. వారంగా మళ్లీ టెట్‌ రాయడం కంటే డీఎస్సీకి సన్నద్ధం కావడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.